Infinix GT 20 Pro Launch : హై-ఎండ్ గేమింగ్ ఫీచర్లతో మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే భారత్‌లో లాంచ్..!

Infinix GT 20 Pro Launch : ఈ ఫోన్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాగా ఫోన్ ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. భారత్‌లో జీటీ 20ప్రో 4ఎన్ఎమ్ ప్రాసెస్‌పై మీడియాటెక్ డైమన్షిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీని మొదటి ఫోన్ చెప్పవచ్చు.

Infinix GT 20 Pro to launch in India ( Image Credit : Google )

Infinix GT 20 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈ నెల 21న భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. రూ. 25వేల లోపు ధరలో నథింగ్ ఫోన్ 2ఎ, పోకో ఎక్స్6, ఐక్యూ Z9 వంటి ప్రముఖ ఫోన్లతో పోటీపడుతుంది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ఈవెంట్‌కు ముందే ఫోన్ స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. ఈ ఫోన్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాగా ఇప్పటికే ఫోన్ ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా, జీటీ 20ప్రో భారత్‌లో 4ఎన్ఎమ్ ప్రాసెస్‌పై ఆధారపడిన మీడియాటెక్ డైమన్షిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీని కలిగిన మొదటి ఫోన్ అని చెప్పవచ్చు.

ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో : డిజైన్, స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో అనేది ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్‌తో ప్రత్యేకమైన సైబర్ మెచా డిజైన్‌ను కలిగి ఉంది. 8 కలర్లతో వివిధ లైటింగ్ ప్రభావాలకు సపోర్టు ఇస్తుంది. ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. గేమింగ్ డివైజ్ మార్కెట్ కూలింగ్ ఫ్యాన్‌తో రానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది.

ఇతర పోటీదారులతో సమానంగా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానుంది. ప్రత్యేకమైన పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో డిస్‌‌‌ప్లే గేమింగ్ చిప్‌ను కూడా కలిగి ఉంది. 90ఎఫ్‌పీఎస్ హైఫ్రేమ్ రేట్ ఎస్‌డీఆర్ నుంచి హెచ్‌డీఆర్ ఎక్స్ఛేంజ్ వంటి ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే, ఆడియో ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో పెద్ద 6.78-అంగుళాల 10-బిట్ ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. గేమింగ్, స్మూత్ స్క్రోలింగ్‌కు అనువైనదిగా చేస్తుంది. మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం డివైజ్ జేబీఎల్ ట్యూన్డ్ స్పీకర్‌లను కూడా కలిగి ఉంది.

బ్యాటరీ, కూలింగ్ :
హుడ్ కింద, జీటీ 20ప్రో 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఇంటెన్సివ్ ఉపయోగంలో హీట్ మ్యానేజ్ చేయగలదు. వేడి తగ్గించడానికి ఇన్ఫినిక్స్ యాజమాన్య వీసీ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ :
ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో సరికొత్త ఎక్స్ఓఎస్14 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ క్లీన్, బ్లోట్-ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇన్ఫినిక్స్యూజర్లు మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు, రెండు ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు. ఈ డివైజ్ లేటెస్ట్ ఫీచర్‌లు, సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్‌తో రానుంది.

పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు, ప్రత్యేకమైన డిజైన్‌తో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో భారత్‌లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కస్టమైజడ్ ఎల్ఈడీ ఇంటర్‌ఫేస్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కూలింగ్ ఫ్యాన్ వంటి గేమింగ్ ఫీచర్‌లతో రానుంది. మే 21న లాంచ్ కానున్న ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్ పర్ఫార్మెన్స్‌తో గేమర్‌లను టెక్ ఔత్సాహికులను ఆకర్షించనుంది.

Read Also : Motorola Razr 50 Series : మోటోరోలా నుంచి మడతబెట్టే రెజర్ 50 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, స్పెషిఫికేషన్లు లీక్..

ట్రెండింగ్ వార్తలు