Realme 12 Pro 5G Series : రియల్‌మి 12ప్రో 5జీ సిరీస్ లాంచ్ డేట్ ఇదే.. ముందుగా రెండు మోడళ్లు.. స్పెషిఫికేషన్లు ఇవేనా?

Realme 12 Pro 5G Series : రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో ఈ నెల 29న రియల్‌మి 12ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme 12 Pro 5G Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ఈ నెల (జనవరి) 29న రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. కనీసం రెండు మోడళ్లతో అధికారికంగా లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీగా ఉంది. రియల్‌మి 12 ప్రో, రియల్‌మి 12 ప్రో ప్లస్ లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తోంది. రియల్‌మి 12 ప్రో 5జీ ఫోన్ 64ఎంపీ ఓమినీవిజన్ ఓవీ64బీ పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్‌ని క్యారీ చేయనుంది.

Read Also : Realme 12 Pro 5G Series : రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

రియల్‌మి 12 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
రియల్‌మి 12 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసీలో రన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌సెట్ రియల్‌మి 12 ప్రో ప్లస్ కు పవర్ అందించగలదు. రియల్‌మి సోషల్ మీడియా వేదికగా రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ లైనప్‌లో 120ఎక్స్ సూపర్ జూమ్ సపోర్ట్‌తో 64ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ64బీ పెరిస్కోప్ లెన్స్ ఉండనుంది. ఈ సెన్సార్ 1/2-అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఇతర ఫ్లాగ్‌షిప్‌లు ఉపయోగించే 1/2.52 ఇమేజ్ సెన్సార్ కన్నా సెన్సార్ 27.62 శాతం పెద్దదని రియల్‌మి పేర్కొంది.

Realme 12 Pro 5G Series Offer  

రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ ఓఐఎస్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890ని కలిగి ఉంటుంది. సాధారణ రియల్‌మి 12 ప్రో మోడల్ గత ఏడాదిలో రియల్‌మి 11 ప్రో ప్లస్‌లో చూసిన 200ఎంపీ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇండియా వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీలో రాబోయే ఫోన్‌ల కెమెరా నమూనాలను కెమెరా సామర్థ్యాలను రివీల్ చేసిసంది. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్‌లు బ్లూ, క్రీమ్ కలర్ ఆప్షన్‌లలో వచ్చే అవకాశం ఉంది. రియల్‌మి 11 ప్రో ప్లస్ 5జీ క్రీమ్ కలర్ వేరియంట్ సన్‌రైజ్ బీజ్ వెర్షన్‌తో సమానంగా ఉంటుంది.

భారత్‌లో ఈ నెల 29న లాంచ్ :
భారత మార్కెట్లో రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ లాంచ్ జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉండనుందని కంపెనీ ధృవీకరించింది. రియల్‌మి 12 ప్రో ప్లస్ మోడల్.. ఇటీవల గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ ఆర్ఎమ్ఎక్స్3840తో కనిపించింది. ఈ లిస్టింగ్ హ్యాండ్‌సెట్‌లో 12జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెనరేషన్ 2 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సూచించింది.

రెగ్యులర్ రియల్‌మి 12 ప్రో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. ఈ రెండు మోడల్స్ 67డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్-ఎడ్జ్ ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ ప్యానెల్‌లను పొందవచ్చు. రియల్‌మి 12 ప్రో, రియల్‌మి 12 ప్రో ప్లస్ మోడళ్లతో మూడో రియల్‌మి 12 ప్రో మ్యాక్స్ మోడల్‌ కూడా ఉండే అవకాశం ఉంది.

Read Also : Realme Note 50 Launch : ఈ నెల 23న రియల్‌మి నోట్ 50 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు