Realme C65 Launch : భారీ డిస్‌ప్లే, 5జీ సపోర్ట్‌తో రియల్‌మి C65 ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర రూ. 10,499 మాత్రమే!

Realme C65 Launch : భారత మార్కెట్లో రియల్‌మి సి65 ఫోన్ రూ. 10,499 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో 5జీ సపోర్ట్ ఉంది. 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తుంది.

Realme C65 Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి సి65 రూ. 10,499 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. బడ్జెట్ ఫోన్‌లో 5జీ సపోర్ట్ కూడా అందిస్తుంది. 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మంచి చిప్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ హ్యాండ్‌సెట్‌ను కొంచెం తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. లేటెస్ట్ రియల్‌మి ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 15 Pro : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.16,700 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

భారత్‌లో రియల్‌మి సి65 ధర, సేల్ తేదీ, లాంచ్ ఆఫర్లు :
భారత మార్కెట్లో రియల్‌మి సి65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ 10,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా ఈ ఫోన్ 2 మోడల్స్ ఉన్నాయి. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,499, అయితే 6జీబీ+ 128జీబీ వెర్షన్ ధర రూ. 12,499కు అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫెదర్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది.

రియల్‌మి సి65 ఫస్ట్ సేల్ ఏప్రిల్ 26 నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య జరుగుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC, Axis, SBI, ఇతర కార్డ్‌లను ఉపయోగించి రూ. వెయ్యి వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

రియల్‌మి సి65 స్పెసిఫికేషన్లు ఇవే :
కొత్తగా లాంచ్ అయిన రియల్‌మి సి65 5జీ ఫోన్ 6.67-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో 89.97 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 625నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీని అందిస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి మరింత విస్తరించవచ్చు.

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. వెనుకవైపు ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది. 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో కలిసి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 8ఎంపీ షూటర్‌ ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది. ఈ డివైజ్‌కు 2ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 3ఏళ్ల ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌లు వస్తాయని కంపెనీ పేర్కొంది. హుడ్ కింద, 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని పొందవచ్చు. కంపెనీ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. ఈ కొత్త రియల్‌మి బడ్జెట్ ఫోన్ కూడా ఐపీ54 రేటింగ్ కలిగి ఉంది.

Read Also : Apple iPhone 16 : ఫిజికల్ బటన్ డిజైన్ లేకుండానే ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ డేటా వెల్లడి!

ట్రెండింగ్ వార్తలు