Vivo X100 Series India : భారత్‌కు వివో X100 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X100 Series Launch in India : భారత మార్కెట్లోకి వివో X100 సిరీస్ రానున్నట్టు వివో ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మైక్రోసైట్ ద్వారా కంపెనీ రివీల్ చేసింది. ఆకర్షణీయమైన ట్రిపుల్ రియర్ కెమెరాలకు సంబంధించిన పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.

Vivo X100 Series Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇటీవల భారత మార్కెట్లో వివో ఎక్స్100 సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే, రాబోయే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గురించి అధికారిక భారతీయ వెబ్‌సైట్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టెక్ దిగ్గజం ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ విషయాన్ని రివీల్ చేసింది.

Read Also : Vivo Y36i Launch : అత్యంత సరసమైన ధరకే వివో Y36i వచ్చేసింది.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!

భారత మార్కెట్లో వివో ఎక్స్100 సిరీస్ రాబోయే లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది. వివో X100, వివో X100 ప్రో అనే రెండు భారతీయ మోడల్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీ, (Zeiss) బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాలు, వి3 ఇమేజింగ్ చిప్‌ను అందిస్తుంది. 8టీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో రానున్న వివో ఎక్స్ 100 సిరీస్ ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, వచ్చే జనవరిలో ఈ కొత్త ఎక్స్ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో X100 సిరీస్ ధర (అంచనా) :
నివేదిక ప్రకారం.. హాంకాంగ్‌లో వివో X100, వివో X100 ప్రోలు వరుసగా 7,998 డాలర్లు (సుమారు రూ. 85,224), 5,998 డాలర్లు (దాదాపు రూ. 63,917) ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉన్నాయి. అదే భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలపై అనేక అంచనాలు నెలకొన్నాయి. చైనాలో వివో X100, వివో X100 ప్రో ప్రారంభంలో వరుసగా సీఎన్‌వై 4,999 (సుమారు రూ. 56,500), సీఎన్‌వై 3,999 (సుమారు రూ. 50వేల) ధరకు అందుబాటులో ఉన్నాయి.

Vivo X100 Series  

వివో X100 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
జీయిస్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లతో వివో ఎక్స్100 సిరీస్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 4పై రన్ అవుతుంది. 6.78- కర్వ్ కలిగి ఉంది. అంగుళాల 8 ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేలు గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. రెండు మోడల్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా వివో వి3 చిప్‌ను కలిగి ఉంటాయి.

ప్రాథమిక కెమెరా 50ఎంపీ సెన్సార్, బ్యాటరీపరంగా ప్రామాణిక వివో ఎక్స్100 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే, వివో ఎక్స్100 ప్రో 100డబ్ల్యూతో 5,400ఎంఎహెచ్ యూనిట్‌ను కలిగి ఉంది. ఛార్జింగ్ సామర్ధ్యం, అదనపు 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కలిగి ఉంది.

Read Also : Poco C65 First Sale : ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి65 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర కేవలం రూ.7,499 మాత్రమే!

ట్రెండింగ్ వార్తలు