Sexual Harassment : నాతో సినిమాకు వస్తే పింఛన్ శాంక్షన్ చేస్తా…

కుటుంబంలో అందరినీ పోగొట్టుకున్న యువతికి తండ్రి  పింఛన్ మంజూరు చేయటానికి ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.

Sexual Harassment :  కుటుంబంలో అందరినీ పోగొట్టుకున్న యువతికి తండ్రి  పింఛన్ మంజూరు చేయటానికి ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో  నివసించే యువతి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. పింఛన్ తో బతికే ఆయన ఇటీవల మరణించారు. అంతకు ముందే తల్లి మరణించింది. దీంతో తల్లితండ్రులిద్దరూ చనిపోయిన ఆ యువతి అనాధలాగా మారింది.

దీంతో తండ్రికి వచ్చే పింఛన్  తనకు మంజూరు చేయాలని కోరుతూ మేడ్చల్ ట్రెజరీ ఆఫీసులో నాలుగు రోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తును పరిశీలించిన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పవన్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో సినిమాకు వస్తేనే పింఛన్  మంజూరు చేస్తానని లైంగికంగా వేధించసాగాడు.

Also Read : Covid Vaccination : కోవిడ్ టీకాలో 4కోట్ల మార్కును దాటిన తెలంగాణ

మరోసారి ట్రెజరీ ఆఫీసుకు వెళ్ళినప్పడు కూడా ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆ అధికారి ఆఫీసుకు నుంచి మెల్లగా జారుకున్నాడు. విషయాన్ని అక్కడి అధికారులకు, టీఆర్ఎస్ నాయకులకు యువతి వివిరంచగా…ఏటీవోకు, యువతికి మధ్య రాజీ కుదిర్చారే గానీ అసలు విషయం బయటకు రానియ్యలేదు.

కాగా…… యువతి చెప్పేదంతా అబధ్దమని కొట్టి పారేస్తున్నాడు ఏటీవో పవన్ కుమార్. యువతి తనకు పెళ్లి కాలేదని అబధ్ధం చెపుతూ పింఛన్  కోసం దరాఖాస్తు చేసుకుందని… నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరిస్కరించి రికవరీకి ఆదేశాలివ్వడంతోనే యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు