SSC Recruitment : భారత వాతావరణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.48,912 చెల్లిస్తారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబరు 18లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

SSC Recruitment : భారత వాతావరణ శాఖలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 990ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-‘బి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ ఖాళీలు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా 60 శాతం మార్కులతో డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌) ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.

అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.48,912 చెల్లిస్తారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబరు 18లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ssc.nic.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు