Thanks Giving Day : ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోతే ఇప్పుడైనా చెప్పండి..Thank You so Much

నవంబర్ 25. Thanksgiving డే.ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోతే ఇప్పుడైనా చెప్పండి..Thank You so Much అని..

Thanks Giving Day 2021 Special Story :  నవంబర్ 25. Thanksgiving డే. ఎవరైనా మనకు సహాయం చేస్తే Thanks (ధన్యవాదం) చెబుతాం. అది మర్యాద. కానీ ఒక్కో సందర్భంలో Thanks చెప్పటం మర్చిపోతాం. లేదా ఎందుకులే అనుకుంటాం. కానీ అలా మీరు సహాయం చేసినవారికి Thanks చెప్పలేదా? చెప్పాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే చెప్పేయండి..మంచి పని చేయటానికి ఏమాత్రం ఆలోచించవద్దు. Thanks అని చెబితే మనం సహాయం చేసినవారికి ఇచ్చిన మర్యాద. ఆ చిన్న పదం వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మరోసారి సహాయం చేయాల్సిన సందర్భం వస్తే చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ Thanksgiving డే రోజున మీరు ఎవరికైనా Thanks చెప్పటం మర్చిపోయినా…చెప్పాలని అనుకున్నా వెంటనే చెప్పేయండి..

సహాయం అంటే డబ్బే కాదు.ఆస్తులే కాదు.ఓ మాట. ఓ మద్ధతు. ఓ ఓదార్పు. ఓ అండ. ఓ భరోసా, ఓ సలహా ఇలా ఏం చేసినా Thanks చెప్పాలి. అది మర్యాదే కాదు..మన విజ్ఞత కూడా. వారిని ప్రత్యక్షంగాకలిసి చెప్పటం కుదరకపోయినా ఏం ఫరవాలేదు.ఫోన్ చేసి అయినా Thanks చెప్పొచ్చు. కుదిరితో అలాంటి వారి వద్దకు వెళ్లి ఒకసారి కలిసి, మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పందుకే ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ డే చక్కటి సందర్భం.

Read more : CBI ready to arrest punch prabhakar : పంచ్ ప్రభాకర్ కు ‘పంచ్’..అరెస్ట్ కు రంగం సిద్ధం

క్షణం తీరిక లేకుండా జీవితాల నుంచి కాస్త సమయం తీసుకుని అలాంటి చక్కగా ఆలింగనం చేసుకోవడం కోసమే ఈ రోజు Thanksgiving డే. వారు చేసిన సేవ, సాయంగాని, ముఖ్యమైన సలహా గానీ, చేసిన మేలు, త్యాగం ఇలా ఏదైనా గుర్తు చేసుకోవడం.మన అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం

Thanksgiving day నేపథ్యం..
ప్రపంచవ్యాప్తంగా ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటిసారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న నిర్ణయించారు. అయితే తరువాత మరో అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం రోజు ఈ కృతజ్ఞతా దినోత్సవంగాపాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమెరికాలో నేషనల్‌ హాలిడే కూడా. సాంప్రదాయం ప్రకారం స్నేహితులు, హితులందరితో చక్కటి విందు భోజనం చేయడంతోపాటు ఉత్సాహంగా అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు.

Thanksgiving డే గురించి చాలామందికి తెలియదు. ఇది భారత్ లో పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కానీ అమెరికా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్‌తో సహా ఇతర దేశాలలో కూడా థాంక్స్ గివింగ్ జరుపు కుంటారు. పండుగ తర్వాత మరుసటి రోజు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేళా ఉంటుంది. కెనడాలో అక్టోబర్ రెండవ సోమవారం థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేడుక జరుపుకుంటారు.

Read more : Tomato: వంటకాల్లో టమోటాలకు ప్రత్నామ్నాయంగా ఇవి వాడండీ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా

జీవితంలో తెలిసో తెలియకో, పాజిటివ్‌గానో, నెగిటివ్‌గానో ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. వారిని ఏడాదికి ఒకసారైనా గుర్తు చేసుకోవడానికే ఈ కృతజ్ఞతా దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సెకండ్‌వేవ్‌తో జనం అల్లాడిపోయారు. తీరని కష్టాల్లో ఉన్న అలాంటి వారిని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. 24 గంటలూ నిద్రాహారాలు మాని, బాధితులకు ఎనలేని సేవలందించారు. వారి త్యాగాలు, సేవలకు విలువ కట్టడం అసాధ్యం. అలాంటి వారిందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. సో… ఇంకెందుకు ఆలస్యం.. అలాంటి గొప్ప వ్యక్తులు అందరికీ థ్యాంక్స్‌ చెప్పేయండి. Thanks Giving Day శుభాకాంక్షలు..అందరికి..ఈరోజు గురించి తెలుసుకుని అందరు సహాయం చేసినవారికి Thanksgiving చేస్తారని కోరుకుంటు..

ట్రెండింగ్ వార్తలు