sleep during the day : పగటిపూట నిద్ర మంచిది కాదా! సోమరితనం, బద్ధకం పెరిగేలా చేస్తుందా?

ఒత్తిడికి గురైనప్పుడు లేదంటే సమస్యకు పరిష్కారం కనుగొనలేనప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని చాలావరకు అధ్యయనాలలో తేలింది. మధ్యాహ్న నిద్ర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని కారణంగా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.

sleep during the day : మారుతున్న జీవన శైలితో చాలామంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటే రిఫ్రెష్‌ అవుతారు. ఒక గంట లేదా అంతకంటే తక్కువసేపు నిద్రపోతారు. మధ్యాహ్నం పూట నిద్రపోవడం సాధారణం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక భాగం. యునైటెడ్ స్టేట్స్‌లో, నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, పెద్దవారిలో మూడింట ఒకవంతు మంది క్రమం తప్పకుండా మధ్యాహ్నం ఒక కునుకు తీస్తారు. పగలు, రాత్రి పని చేసే వ్యక్తులకు మధ్యాహ్న నిద్ర మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఒత్తిడికి గురైనప్పుడు లేదంటే సమస్యకు పరిష్కారం కనుగొనలేనప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని చాలావరకు అధ్యయనాలలో తేలింది. మధ్యాహ్న నిద్ర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని కారణంగా శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. పగటి నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీ మెదడును అలర్ట్ చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్‌ల నుంచి మీ హృదయాన్ని సురక్షితంగా రక్షించుకోవచ్చు.

అదే సమయంలో పగటిపూట అధిక సమయం నిద్ర మంచిది కాదు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మధ్యాహ్నం నిద్ర పోకుండా ఉంటారు. నిద్ర అనేది మనిషికి కొత్త శక్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే నిద్ర అనేది అందరికీ అవసరం. పొద్దున్నే ఆలస్యంగా లేచిన సోమరితనం అనేది వస్తుంది. అందుకే రాత్రిపూట తొందరగా పడుకొని ఉదయాన్నే తొందరగా లేస్తే శరీరం యాక్టివ్ గా ఉంటుంది. సోమరితనాన్ని, బద్దకాన్ని వదిలించుకోవాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడం, సరైన రీతిలో పడుకోవడం, కూర్చోవడం, ఉదయాన్నే తొందరగా లేవడం చేస్తే సోమరితనం పోతుంది. మధ్యాహ్న నిద్ర ఒక గంటలోపే ఉండాలి. లేదంటే ఊబకాయం, బద్దకం పెరుగుతాయి. అంతేకాదు హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు