కరోనా బాధిత మహిళపై అంబులెన్స్‌లో లైంగిక వేధింపులు..పరిస్థితి విషమం

ambulance attendant sexually harasses covid patient : కామాంధులకు కన్నూ మిన్నూ కానదు అని ఊరికనే అనలేదు. ఆరు నెలల పసిబిడ్డ మొదలుకుని కాటికి కాళ్లు చాపుకున్న పండు ముదుసలిని కూడా కామాంధులు వదలటంలేదు. లైంగి దాడులకు తెగబడుతున్నా దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి. కానీ మరీ నీచంగా కరోనా సోకి బాధపడుతూ ఊపిరి ఆడక అల్లాడిపోతున్న ఓ మహిళా పేషెంట్ పై ఆరోగ్యాన్ని అందించే అంబులెన్స్ లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో అటెండర్.

దీన్ని బట్టి కామం ఎంతగా కళ్లకు కట్టిందో అర్థం చేసుకోవచ్చు. వినటానికి ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మరి ఆ బాధితురాలు ఎలా భరించి ఉంటుందో తలచుకుంటేనే వాడిని చంపేయాలన్నంత ఆగ్రహం వస్తోంది. కానీ పాపం..కరోనా బాధపడుతూ లైంగిక వేధింపులను భరించిన ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారిన అమానవీయ ఘటన కేరళలో జరిగింది. అంబులెన్స్‌లో మహిళా కోవిడ్ పేషెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు.కరోనాతో బాధపడుతున్న మహిళ నిస్సహాయతను ఆసరాగా తీసుకోని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.

కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన మే 13న వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న బాధితురాలు వైద్యులకు జరిగిన దారుణం గురించి చెప్పడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్‌గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.

కరోనా సోకిన బాధిత మహిళ పెరింతలమన పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. ఊపిరి ఆడక బాధపడుతోంది. దీంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్‌లో ల్యాబ్‌కు తరలించమని అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిని ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ అటెండెంట్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు.

అయితే అప్పుడు బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఈ దారుణం గురించి ఆమె ఎవరికి చెప్పలేకపోయింది…కొచెం కోలుకున్నాక తర్వాత ఆ రోజు జరిగిన ఘటన గురించి డాక్టర్లకు తెలిపింది. దీంతో డాక్టర్లు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లటంతో కామాంధుడి బాగోతం బైటపడింది.

ట్రెండింగ్ వార్తలు