Lakhimpur Kheri case: సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆశిష్ మిశ్రా

అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం, బెయిల్ వ్యవధిలో మిశ్రా తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి, తన కొత్త లొకేషన్ అధికార పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 2021 అక్టోబర్ 3వతేదీన లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను రైతులు నిరసిస్తున్నప్పుడు చెలరేగిన హింసలో 8 మంది మరణించారు.

Lakhimpur Kheri case: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూరి ఖేరి జిల్లాలో నిరసనగా వెళ్తున్న రైతులపైకి జీపు ఎక్కించి చంపిన కేసులో అరెస్టై చాలా రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదల అయిన వారంలోగా యూపీ నుంచి వెళ్లిపోవాలని, యూపీలో కానీ ఢిల్లీ పరిసరాల్లో కాని ఉండకూడదని బెయిల్ ఇస్తున్న సందర్భంలో ఆశిష్ మిశ్రాను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Pariksha Pe Charcha: విమర్శల గురించి అడగ్గా.. అది సబ్జెక్టు కాదని చెప్పిన ప్రధాని మోదీ

అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం, బెయిల్ వ్యవధిలో మిశ్రా తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి, తన కొత్త లొకేషన్ అధికార పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 2021 అక్టోబర్ 3వతేదీన లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను రైతులు నిరసిస్తున్నప్పుడు చెలరేగిన హింసలో 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు యూపీ డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తల కాన్వాయ్‌లో కార్లలో ఉన్న వ్యక్తులు కాగా, మిగిలిన నలుగురు రైతులు.

Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. 874 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

నలుగురు రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని రైతు సంఘాలు ఆరోపించగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆ వాదనలను ఖండించారు. ఆశిష్ మిశ్రాను ఆరు రోజుల తర్వాత అక్టోబర్ 9న అరెస్ట్ చేశారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండపై విచారణ జరుపుతున్న సిట్.. ఆందోళన చేస్తున్న రైతులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు