CBSE Result 2021: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రద్దయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

CBSE Result 2021: కరోనా సెకండ్ వేవ్ కారణంగా రద్దయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం, సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ(జులై 20) వెలువడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

2021 జూలై 20లోగా సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేయబోతున్నట్లుగా బోర్డు వర్గాలు ప్రకటించాయి. సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి ఫలితం ఈ రోజే ప్రకటించాల్సి ఉండగా, ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉండగా.. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం కూడా బోర్డు ప్రకటించలేదు.

అయితే, సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inలో మాత్రమే బోర్డు ఫలితాలు విడుదల చేయబడుతాయని విద్యార్థులు గమనించవలసిందిగా బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. జూలై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చాక మళ్లీ పరీక్షలు రాసే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో ఒక విద్యార్థి పంచుకున్న సమాచారం ప్రకారం, విద్యార్థులు తమ డిజిటల్ సీబీఎస్ఈ మార్క్‌షీట్/సర్టిఫికెట్‌ను భారత ప్రభుత్వ డిజిలాకర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఇందుకోసం విద్యార్థులు తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. అలాగే, మీరు మొదటిసారి డిజిలాకర్‌ను సందర్శించినట్లైతే మాత్రం పిన్‌ను సెట్ చేసుకోవాలి.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లేదా http://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌లలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు