Sudhakar Singh: రైతులకు న్యాయం జరగడం లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా

రైతులకు అన్యాయం జరుగుతోందని, వారికి మద్దతుగా ఎవరో ఒకరు నిలబడాలని, అందుకే ఆ పనిని తన కుమారుడు చేపట్టారని జగదానంద్ చెప్పారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల బిహార్ రైతులు నాశనమవుతున్నారని చెప్పారు. రైతులకు మేలు చేయాలనే తన కుమారుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు.

Sudhakar Singh: రైతులకు న్యాయం జరగలేదంటూ బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తనకు చెప్పినట్లు ఆయన తండ్రి, ఆర్జేడీ బిహార్ శాఖ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఆదివారం వెల్లడించారు. రైతు సమస్యలపై సుధాకర్ సింగ్ పోరాడాలని అనుకుంటున్నారని, ఈ పోరాటంలో ఆయనకు అనేక సమస్యలు ఎదురవుతాయని, అందుకే తన పదవికి సుధాకర్ రాజీనామా చేసినట్లు జగదానంత్ తెలిపారు.

రైతులకు అన్యాయం జరుగుతోందని, వారికి మద్దతుగా ఎవరో ఒకరు నిలబడాలని, అందుకే ఆ పనిని తన కుమారుడు చేపట్టారని జగదానంద్ చెప్పారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల బిహార్ రైతులు నాశనమవుతున్నారని చెప్పారు. రైతులకు మేలు చేయాలనే తన కుమారుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితం రైతులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుధాకర్ సింగ్ మాట్లాడుతూ తనకు తాను దొంగలకు లీడర్‭నని చెప్పుకుని సంచలనం సృష్టించారు. వ్యవసాయ శాఖలోని ఏ విభాగంలోనూ దొంగలకు కొదువ లేదని అన్నారు. తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కారణంగా ఆ దొంగలందరికీ తానే లీడర్‭నని చెప్పుకున్నారు. ధాన్యం కొనుగోలు, విత్తనాలు-ఎరువుల విక్రయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.

Leader Of Thieves: తనకు తాను దొంగలకు లీడర్‭నని చెప్పుకున్న మంత్రి

ట్రెండింగ్ వార్తలు