Supreme Court: మీకు అనుకూలంగా ఉంటే నియమిస్తారా? కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. గురువారం వరకు సెక్రెటరీ లెవర్ ఆఫీసర్‭గా ఉన్న అరుణ్ గోయెల్‭ను శుక్రవారం వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ వెంటనే ఆయన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్‭గా నియమించారని అన్నారు. ఒకవేళ ఆయనకు ఈసీగా అవకాశం దక్కకపోయి ఉంటే ఈ డిసెంబరులోనే రిటైర్ అయ్యే వారని తెలిపారు

Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రతపై మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు అనుకూలంగా ఉంటే నియమిస్తారా అంటూ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే నిలదీసింది. నవంబర్ 19వ తేదీన రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్‭ను కేంద్ర ఎన్నికల కమిషనర్‭గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయల్ నియామకంపై తమకు దస్త్రాలు సమర్పించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికై కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా గోయెల్ నియామకంపై ధర్మాసనం స్పందించింది. జస్టిస్ కేఎం జోసెఫ్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ స్వచ్ఛంద పరదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఎన్నికల విభాగానికి కమిషనర్‭గా ఎలా నియమిస్తారంటూ కేంద్రాన్ని నిలదీసింది.

Survey: దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒక మహిళపై భర్త వేదింపులు

ఈ విషయమై సుప్రీం ధర్మాసనం ముందు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. గురువారం వరకు సెక్రెటరీ లెవర్ ఆఫీసర్‭గా ఉన్న అరుణ్ గోయెల్‭ను శుక్రవారం వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ వెంటనే ఆయన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్‭గా నియమించారని అన్నారు. ఒకవేళ ఆయనకు ఈసీగా అవకాశం దక్కకపోయి ఉంటే ఈ డిసెంబరులోనే రిటైర్ అయ్యే వారని తెలిపారు. కాగా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ.. నియామకం నిబందనలకు అనుగుణంగానే జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తుండగా మధ్యలో కలుగజేసుకున్న ధర్మాసనం.. ఏజీ వాదనను తోసి పుచ్చింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఈసీగా నియమిస్తుందంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐను చేర్చాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేయాలని, ప్రధాని లాంటి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమిషన్ సభ్యుల్లో ఉండాలని సుప్రీం సూచించింది.

Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‭డే కేక్ కటింగ్‭తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే

ట్రెండింగ్ వార్తలు