HarishRao Comments : ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకనే కాళేశ్వరం పేరిట గారడీలు : హరీష్ రావు మండిపాటు

రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మరి కేఆర్‌ఎంబీకి అప్పగించబోని బీఆర్‌ఎస్‌ చెప్పించిందన్నారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమేనని హరీష్ రావు స్పష్టం చేశారు.

Former Minister Harish rao comments at Telangana Assembly Media Point

Harishrao Assembly Media Point  : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంటూ గారడీలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం (ఫిబ్రవరి 17) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మరి కేఆర్‌ఎంబీకి అప్పగించబోని బీఆర్‌ఎస్‌ చెప్పించిందన్నారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేఆర్‌ఎంబీపై తాము గొంతు విప్పాకే కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని తెలిపారు.

Read Also : ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు.. కర్ణాటక బడ్జెట్ చెబుతున్న పాఠమేంటీ? తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది ఏంటీ?

అది వైట్‌ పేపర్ కాదు.. ఫాల్స్‌ పేపర్‌ :
అంతేకాదు.. ఆరు గ్యారెంటీల అమలుపై కూడా ప్రభుత్వ వైఖరిపై గట్టిగా నిలదీశామన్నారు. దీనిపై సమాధానం చెప్పాల్సిందిబోయి ప్రతిపక్షంపైనే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. నీటిపారుదలశాఖపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూర్తిగా తప్పుల తడకగా హరీష్ రావు విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వం పెట్టింది వైట్‌ పేపర్ కాదు.. ఫాల్స్‌ పేపర్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. వారి ప్రెజెంటేషన్‌లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయన్నారు. తాము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నామని, మీడియా తప్పకుండా ప్రచారం చేయాలని హరీష్ రావు కోరారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు.

మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామన్నా వినలేదన్నారు. పైగా.. కాగ్ పనికి రాదు తాము అనలేదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో​ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ కాగ్ నివేదికను కాగ్‌ను తప్పుపట్టారని, ఈ విషయంలో కాగ్ కూడా తమను అనేకమార్లు మెచ్చుకున్నదని చెప్పారు. కనీసం ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని కాగ్ మిమ్మల్ని తిట్టిందని హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్ :
నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమం చూడాలని, లేదంటే ఆగం అవుతారని, అలానే వదిలేస్తే మీకు పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిపక్షాన్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ఇప్పుడు మేడిగడ్డ అంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మీ ప్రభుత్వ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు అసలు రావడం లేదని ఆయన ఎత్తి చూపారు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా.. ఏనాటికైనా కంచు కంచేనని అన్నారు. ప్రతిపక్ష హోదాలో ప్రజల మధ్య ఉన్నామని అయినా తమపై మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. తాను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరని, ఇదంతా ప్రజలు కూడా చూశారని మాజీ మంత్రి అన్నారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారని, సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరని హరీష్ రావు విమర్శించారు.

Read Also : Pawan Kalyan Vizag Tour : విశాఖలో రెండు రోజుల పవన్ పర్యటన ఖరారు

ట్రెండింగ్ వార్తలు