Pawan Kalyan Vizag Tour : విశాఖలో రెండు రోజుల పవన్ పర్యటన ఖరారు
Pawan Kalyan Vizag Tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల పాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు.
- Sreehari A
- Published On : February 17, 2024 / 08:51 PM IST
Two day Vizag tour of Janasena chief Pawan Kalyan confirmed
Pawan Kalyan Vizag Tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది.
Read Also : తెలంగాణలో పొత్తులపై కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చేసిన కిషన్ రెడ్డి
ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా? లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, విజయనగరం, విశాఖ నుంచి సీట్లను జనసేన ఆశిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ సౌత్, భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన పోటీ చేయాలని భావిస్తోంది.
Read Also : ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు.. కర్ణాటక బడ్జెట్ చెబుతున్న పాఠమేంటీ? తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది ఏంటీ?
