Inter Online Classes : జులై 1 నుంచి ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఆన్‌లైన్‌ క్లాసులు

గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ సెకండ్ ఇయర్ విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరగనున్నాయి. జులై 5 వరకు మొదటి సంవత్సరంలో మొదటి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ చెప్పారు.

Inter 2nd Online Class : గవర్నమెంట్ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ సెకండ్ ఇయర్ విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరగనున్నాయి. జులై 5 వరకు మొదటి సంవత్సరంలో మొదటి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ చెప్పారు. ఈ నెల 16 నుంచి కాలేజీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని జులై 1 నుంచి సెకండ్ఇం టర్‌కు ఆన్‌లైన్‌ క్లాసులను  ప్రారంభిస్తామని తెలిపారు.

తర్వాత మొదటి ఇంటర్‌ అడ్మిషన్లను రెండు, మూడు విడతల్లో జరపనున్నారు. తొలి ఏడాది విద్యార్థులకు కూడా దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు ప్రసారం చేస్తామని చెప్పారు. 70 శాతం సిలబస్‌ ఆధారంగానే క్లాసులు జరుగుతాయని తెలిపారు.

2021-22 విద్యాసంవత్సరానికి 70శాతం సిలబస్‌ నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థులు కాలేజీల్లో పాఠాలు వినేందుకు డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు