నన్ను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.

Cm Revanth Reddy : తనను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని, కేంద్రమంత్రులుగా ఏమైనా చేయవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఉంటే బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. దీనికి కిషన్ రెడ్డి ఏం చెబుతారు? అని నిలదీశారు సీఎం రేవంత్.

ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా.. మోడీ, అమిత్ షా ల గుజరాత్ నుండే వచ్చారని తెలిపారు. ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. జస్టిస్ వెంకట చల్లయ్య కమిషన్ రిపోర్టుపై మోడీ, షా తమ స్టాండ్ ఏంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేశారు. ఆర్టిఫీషియల్, కన్వర్టడ్ బీసీ ప్రధాని మోదీ అంటూ ధ్వజమెత్తారు.

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు.

”బలహీన వర్గాలకు రిజర్వేషన్ పెంచాలన్నది కాంగ్రెస్ విధానం. అబ్కీ బార్.. మోడీ సర్కార్ అంటూ బీజేపీ 400 సీట్లు అంటుంది. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే.. పార్లమెంటులో 400 సీట్లు బీజేపీకి కావాలి. హిందూ రాజ్యం, రిజర్వేషన్ రద్దు ఆర్ఎస్ఎస్ ప్రధాన ఎజెండా. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే.. సీఎంగా నాపైన కేసు పెట్టారు. కేంద్ర హోం మినిస్ట్రీ నాపై కేసు పెట్టింది. మా మహిళా అడ్వకేట్ పై మగ పోలీసులతో హార్ష్ గా వ్యవహరించారు. నేను ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని ఢిల్లీ పోలీసులను పంపించారు. రాజ్యాంగం మార్చుతామని కేంద్రమంత్రులు.. స్పీకర్ సుమిత్రా మహాజన్ లు బహిరంగంగా ప్రకటిస్తున్నారు.. ఇది నిజం కాదా? బీజేపీకి ఓటేస్తే.. రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు పెంచి కొనసాగించేది కాంగ్రెస్. మోడీ… పోలీసులతో బెదిరించాలంటే కుదరదు. కేసులకు నేను భయపడను. ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది. గోల్వాల్కర్ రాసింది తప్పని మోహన్ భగవత్ చెబుతారా?” అని సీఎం రేవంత్ నిలదీశారు.

Also Read : అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఢిల్లీ పోలీసులకు సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్

 

 

ట్రెండింగ్ వార్తలు