Telangana Covid Bulletin : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 12వేల 480 కరోనా పరీక్షలు నిర్వహించగా..

Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 12వేల 480 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 50 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నిన్న 17 కేసులు వెలుగుచూడగా, నేడు రెట్టింపు నమోదయ్యాయి.

Monkeypox : ప్రపంచానికి మంకీపాక్స్ ముప్పు తప్పదా?కరోనాను మించిన పరిస్థితులు చూడబోతున్నామా?

రంగారెడ్డి జిల్లాలో 9, హనుమకొండ జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో 1, మహబూబ్ నగర్ జిల్లాలో 1, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి

రాష్ట్రంలో ఇంకా 377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. తెలంగాణలో నేటివరకు 7లక్షల 92వేల 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 88వేల 460 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 017 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 27మందికి పాజిటివ్ గా తేలింది.

ట్రెండింగ్ వార్తలు