కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్: బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణలో ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ఇది కొత్త ప్రభుత్వం కాదు.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు.

Boianapalli Vinod Kumar: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ఇది కొత్త ప్రభుత్వం కాదు.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు. మళ్లీ గెలిస్తే అమలు చేయడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడుతుంది. అభివృద్ధి కావాల్నా, విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలి. నేను గెలిచిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తా. నేను చెప్పింది చేసి చూపించానని వినోద్ కుమార్ అన్నారు.

కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తల వల్లే తాను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచానని చెప్పారు. తమ పార్టీకి చెందిన కొందరు నాయకులను కాంగ్రెస్ పార్టీ గంప గుత్తగా కొనుక్కొందని ఆరోపించారు. 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిన వాళ్లు ఈ రోజు జై కాంగ్రెస్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడం కరెక్టా అని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు కనీసం కార్పొరేటర్లుగా గెలవరని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఎవరూ పార్టీ మారే అవకాశం లేదన్నారు.

Also Read: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, నేను బతికుండగా అలా జరగనివ్వను- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు