Groundnut Crop : వేరుశనగలో పంటను ఆశించే పొగాకు లద్దె పురుగు.. నివారణ చర్యలు

ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనగా తామర పురుగు, పచ్చదోమ,పేనుబంక , అకు తినే పాగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.

 Groundnut Cultivation

Groundnut Crop : నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైన పంట. వేరుశనగను ప్రధానంగా రబి/వేసవిలో ఆరుతడి పంటగా చెరువులు మరియు బోరుబావులు క్రింద సాగుచేయబడుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని అన్ని జిల్లాలలోను, ఉత్తర కోస్తాలో విజయనగరం, శ్రీకాకుళం మరియు విశాఖవట్నం జిల్లాల్లోను, తెలంగాణా రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, వరంగల్‌,కరీంనగర్‌, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల్లో సాగు చేయబడుతుంది. నాణ్యమైన అధిక దిబగుబడునిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చీడపీడల ఉదృతి అధికమై సరియైన నమయంలో  రైతులు గుర్తించకపోవడం వలన వేరుశనగలో కాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

READ ALSO : Groundnut Cultivation :వేరుశనగ పంటకు చీడపీడల బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

రబీ వేరుశనగ పంటలో పూత దశ నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనగా తామర పురుగు, పచ్చదోమ,పేనుబంక , అకు తినే పాగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.

పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు ;

తల్లి పురుగులు అకుల పైబాగాన గుంపులుగా గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహరితాన్ని గోకి తినివేసి, జల్లెడాకుగా మారుస్తాయి. ఎదిగిన లద్దె పురుగులు సాయంత్రం / రాత్రి వేళలో ఆకులను ఆశించి పూర్తిగా తినివేస్తాయి. ఈ పురుగు పంట తొలి దశ నుండి అనగా విత్తిన 20 రోజూల నుండి మొక్కలను ఆశించి నష్టవరుస్తాయి.

READ ALSO : Groundnut Varieties : ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

నివారణ ;

వేసవిలో ట్రాక్టరుతో లోతుగా దుక్కులు చేయడం వలన వ్యూపా దశలో బయటపడ్డా ఎండవేడిమికి , పక్షుల బారిన పడి నాశనం అవుతాయి. గుడ్డ సముదాయాన్ని, పిల్ల పురుగుల సముదాయాలను ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి.

వేరుశనగ పైరు చుట్టూ 50-100 అముదము, ప్రొద్దుతిరుగుడు మొక్కలను ఎర పంటలుగా నాటాలి. ఆ విధంగా రెక్కలపురుగుల ఉధృతిని అంచనా వేయాలి. ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.

READ ALSO : Groundnut Cultivation : తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి.. ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు

గ్రుడ్లు/ చిన్న లద్దెపురుగు సముదాయమునూ అకులపై కనిపించిన వెంటనే 5 శాతం వేప గింజల కషాయము అనగా 10 కిలోల వేప గింజల పొడి, 200 లీటర్ల నీటికి 12 గంటలు నానబెట్టి వడగట్టి ఎకరా పైరుపై సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.

చిన్న లద్దె వురుగు నివారణకు క్వినాల్‌ ఫాస్‌ 400 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాన్‌ 500 మి.లీ. మందును 200 లీ. నీటికి కలుపుకొని ఎకరానికి పిచికారి చేసుకోవాలి. బాగా ఎదిగిన లద్దె పురుగు నివారణకు నోవాల్యురాన్‌ 200 మి.లీ. లేదా థయోడికార్డ్‌ 200 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 60 మి.లీ.లలో ఒక మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

బాగా ఎదిగిన లార్వాలు,లద్దె పురుగులు నివారణకు విషపు ఎరను 10 కి. తవుడు, 1 బెల్లం, 1/2 లీ. క్లోరిపైరిఫాస్‌ తయారు చేసి సాయంత్రం వేళల్లో చిన్న చిన్న ఉండలుగా చేసి పంటలో వెదజల్లాలి.

ట్రెండింగ్ వార్తలు