Groundnut Cultivation :వేరుశనగ పంటకు చీడపీడల బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి.

Groundnut Cultivation

Groundnut Cultivation : నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్థుతం 30 నుండి 60 రోజుల దశలో పంట వుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద అధికమవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రసం పీల్చు పురుగులు, లద్దెపురుగుల తాకిడి అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు ద్వారా తెలుసుకుందాం.

READ ALSO : Weed Control : వెద వరి సాగులో.. కలుపు నివారణ

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో వేరుశనగ గింజ కట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది.

READ ALSO : మోకాళ్ల నొప్పులు ఉంటే ఎక్కువ నడవకూడదా?

ప్రధానంగా రసంపీల్చు పురుగుల వల్ల చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల లేక గిడసబారినట్లు కనిపిస్తోంది. వెంటనే వీటి నివారణకు సమగ్రసస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు. వేరుశనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా వుంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే…దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలంటారు శాస్త్రవేత్త.

ట్రెండింగ్ వార్తలు