Mango Plantations : మామిడి తోటల్లో కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

భూమి గుల్ల బారటం వలన నీరు ఎక్కువగా ఇంకుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. రెండోసారి వర్షాకాలం అనగా సెప్టెంబరు చివరిలో పొలాన్ని దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన పిల్లిపెనర, మరియు జనుము ఎకరానికి 15 నుండి 20 కిలోలు చొవ్చున జూలై మాసంలో విత్తుకోవాలి.

Mango Plantations : మామిడి తోటల యాజమాన్యంలో అంతరకృషి చాలా ముఖ్యమైనది. తోటలో ఎవ్వుడూ. కలువు లేకుండా జాగ్రత్తపడాలి. ఏడాదిలో కనీనం రెండుసార్లు పొలాన్ని దున్నుకోవాలి. మొదటిసారి తొలకరి. వర్షాలు పడగానే, నేలలో పదును చూసుకొని వరుసల మధ్య దున్నాలి. ఇందువలన కలువు నివారణ, నేలలోని పురుగుల గుడ్డు, నిద్రావస్థలో ఉన్న పురుగులు, హాని చేసే శిలీంద్రాలు బహిర్గతమై నశిస్తాయి.

భూమి గుల్ల బారటం వలన నీరు ఎక్కువగా ఇంకుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. రెండోసారి వర్షాకాలం అనగా సెప్టెంబరు చివరిలో పొలాన్ని దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన పిల్లిపెనర, మరియు జనుము ఎకరానికి 15 నుండి 20 కిలోలు చొవ్చున జూలై మాసంలో విత్తుకోవాలి. వీటిని నాటిన 45 రోజులకు పూతకు రాక ముందే భూమిలో కలియదున్నాలి.

ఈ అంతరకృషి వలన తోటలో గడ్డి, గరిక పెరగదు. దీని వలన నీటిని నిల్వ చేసుకొనే గుణం పెరగడం ద్వారా అతి వేడి సమయంలో అంటే ఎండాకాలంలో కూడ చెట్లు చనిపోకుండా ఉంటాయి. రసాయన పద్దతిలో కలుపు నివారణకు, భూమిలో తేమ ఉన్నప్పుడు లీటరు నీటికి 10 మి.లీ గైఫోసేట్‌ +10 గ్రా. అమ్మోనియం సల్ఫేట్‌ లేదా యూరియా కలిపి నాజిల్‌కు డోమ్‌ వంటిది పెట్టి మామిడి మొక్కల మీద పడకుండా పిచికారి చేయాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే లీటరు నీటికి 1 మి.లీ ఆక్సీఫ్లోరోఫెన్‌ 23.5% ద్రావకం పిచికారి చేస్తే కలుపు మొలవకుండా నివారించవచ్చును.

ట్రెండింగ్ వార్తలు