Prevention of Pests : వరి, పత్తి పంటల్లో పురుగుల నివారణ

ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి  పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.

Pest Control

Prevention of Pests : వాతావరణ మార్పుల కారణంగా వరితోపాటు పత్తిపైర్లలో చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల  ఆకులు రంగు మారిపోయి, మొక్కలు సరిగా ఎదగటంలేవు. వీటితో పాటు పత్తిలో రసంపీల్చే పురుగులు, గులాబీరంగు పురుగులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు వరికి సుడిదోమ,  మొగి పురగులు ఆశించి తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్వాతి.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

ఈ ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి  పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది. ముఖ్యంగా రసంపీల్చే పురుగులతోపాటు  గులాబిరంగు పురుగులు ఆశించి తీవ్రం నష్టపరుస్తున్నాయి.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

మరోవైపు చాలా ప్రాంతాల్లో వరి పంట పిలక దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది. అయితే మొగిచుపురగు, సుడిదోమ లాంటి పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే నివారించినట్లైతే మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరి, పత్తి పంటల్లో ఆశించిన పురుగులు వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్వాతి.

ట్రెండింగ్ వార్తలు