పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

కుక్క యాజమానిని విచారించగా.. బిస్కెట్లు, కుక్కల ఆహారం కాకుండా తన పెంపుడు కుక్కకు రోజుకు 8 నుంచి 10 చికెన్ ..

New Zealand dog

New Zealand woman jailed : మీరు కుక్కను పెంచుకుంటున్నారా? అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పెంపుడు కుక్కుకు అతిగా ఆహారం తినిపించినందుకు ఓ మహిళకు న్యాయస్థానం రెండు నెలలు జైలు శిక్ష విధించింది. ఈ విచిత్ర ఘటన న్యూజిలాండ్ దేశంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ కు చెందిన ఓ మహిళ కక్కను పెంచుకుంటుంది. ప్రతీరోజూ దానికి ఆహారం అందిస్తూ తన ఇంట్లో మనిషిలా చూసుకుంటూ వచ్చింది. కొద్దిరోజులు దానికి మోతాదు స్థాయికి మించి ఆహారాన్ని అందించింది. దీంతో ఆ క్కుక 53.7 కిలోల బరువు పెరిగి చివరికి కన్నుమూసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు కుక్క మృతికి మహిళ కారణమని ఆమెకు రెండు నెలలు జైలు శిక్ష విధించారు.

Also Read : Zomato Veg Meal : వెజ్ మీల్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్క ప్రత్యక్షం.. కస్టమర్ ఫిర్యాదుతో జొమాటో క్షమాపణలు..!

కుక్క యాజమానిని విచారించగా.. బిస్కెట్లు, కుక్కల ఆహారం కాకుండా తన పెంపుడు కుక్కకు రోజుకు 8 నుంచి 10 చికెన్ ముక్కలను తినిపించానని ఆమె అంగీకరించింది. అందువల్ల కుక్క కొద్దిరోజుల్లోనే 53.7 కిలోల బరువు పెరిగింది. దీంతో కుక్క గుండె చప్పుడు వినడం కూడా కష్టమయ్యేంత మందపాటి కొవ్వుపొర కుక్క శరీరంపై ఉందని వైద్యులు గుర్తించారు. ఆ సమయంలో కుక్కకు కండ్ల కలక వచ్చి దాని గోళ్లు బాగా పెరిగాయి. కుక్క పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండటంతో 10 మీటర్లు నడవాలంటేనే మూడు సార్లు ఆగాల్సి వచ్చింది. దీంతో కుక్క తీవ్ర అనారోగ్యానికి గురై మరణించింది.

Also Read : అడవిలో ఒంటరి మహిళ.. ఇనుప గొలుసుతో చెట్టుకు బంధించిన దుర్మార్గులు

రాయల్ న్యూజిలాండ్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (SPCA) ప్రకారం.. జంతు నియంత్రణ అధికారులు అక్టోబర్ 2021లో సదరు మహిళ నివాసంలో తనిఖీలు చేయగా.. భారీ కాయం కలిగిన కుక్కను గుర్తించారు. భారీ కాయం కలిగిన కుక్కతో పాటు.. మరికొన్ని కుక్కలను ఆమె నివాసంలో స్వాధీనం చేసుకొని ఆక్లాండ్ జంతు ఆశ్రయానికి తరలించారు. అధిక బరువు కలిగిన కుక్కకు వైద్య చికిత్సల ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆ కుక్క చనిపోయింది. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేశారు. తాజాగా న్యాయస్థానం మహిళకు రెండు నెలలు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 12నెలలపాటు ఆమె ఎలాంటి కుక్కలను పెంచుకోకుండా కోర్టు నిషేధం విధించింది.

 

ట్రెండింగ్ వార్తలు