Groundnut : రబీ వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ!

ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో పక్షిస్ధావరాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న లద్దె పెరుగులను ఆకులపై కనిపించిన వెంటనే 5శాతం వేప గింజల కషాయం, సాయంత్రం సమయంలో పిచికారి చేసుకోవాలి.

groundnut

Groundnut : నూనె గింజల పంటలలో వేరుశనగకు ప్రత్యేక స్ధానం ఉంది. రబీలో వేరుశనగ సాగు చేస్తే పంటలో పూత దశ నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. చీడపీడల ఉధృతి అధికంగా ఉండే నేపధ్యంలో రైతులు సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వేరుశనగ పంటలో పొగాకు లద్దె పురుగు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురగు ఆశిస్తే పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది.

వేరు శెనగలో పొగాకు లద్దె పురుగు, నివారణ చర్యలు ;

తల్లి పురుగులు ఆకుల పైభాగంలో గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి వచ్చిన పిల్లలు గుంపులు, గుంపులుగా ఆకులపై పత్రహరితాన్ని గోకి తినేస్తాయి. జల్లెడగా ఆకును మారుస్తాయి. ఎదిగిన లద్దె పెరుగులు సాయంత్రం , రాత్రి వేళలో ఆకులను ఆశించి తినేస్తాయి. ఈ పురుగు పంట తొలి దశ నుండి మొక్కలను ఆశిస్తుంది.

నివారణ చర్యలు ;

దీని నివారణకు వేసవిలో ట్రాక్టరుతో లోతైన దుక్కులు చేయాలి. ఇలా చేయటం వల్ల ప్యూపా దశలో ఉన్న పిల్ల పురుగులు ఎండవేడికి నాశనం అవుతాయి. పక్షులు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. గుడ్ల సముదాయాన్ని, పిల్ల పురుగులను ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి. పైరు చుట్టూ ఆముదము , ప్రొద్దు తిరుగుడు, మొక్కలను ఎర పంటలుగా వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పురుగు ఉధృతిని కొంత మేర తగ్గించుకోవచ్చు.

ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో పక్షిస్ధావరాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న లద్దె పెరుగులను ఆకులపై కనిపించిన వెంటనే 5శాతం వేప గింజల కషాయం, సాయంత్రం సమయంలో పిచికారి చేసుకోవాలి. చిన్న లద్దె పురుగుల నివారణకు క్వినాల్ ఫాస్ 400మి.లీ లేదా క్లోరోఫైరిఫసా్ 500మి.లీ మందును 200 లీ నీటికి కలుపుకొని ఎకరానికి పిచికారి చేయాలి.

బాగా ఎదిగిన లద్దె పురుగు నివారణకు నోవాల్యురాన్ 200 మి.లీ, లేదా థయోడికార్డ్స్ 200గ్రా, లేదా క్లోరిఫైరిఫాస్ 500మి.లీ, లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60మి.లీలలో ఏదో ఒక మందును 200లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. బాగా ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను తయారు చేసి సాయంత్ర సమయంలో చిన్నిచిన్న ఉండలుగా చేసి పంటపొలంలో వెదజల్లాలి.

ట్రెండింగ్ వార్తలు