Posani Krishna Murali : సీఎం జగన్ మీద నిందలు వేస్తే.. వాడు 100 అడుగుల లోతులో పాతుకుపోతాడు

తమ కుటుంబం క‌రోనాతో భాద‌ప‌డుతున్న స‌మ‌యంలో సీఎం, ఆయ‌న స‌తీమ‌ణి మాట సాయం చేశారని తెలిపారు. ఏఐజి ఆసుప‌త్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు...

Posani Meets CM YS Jagan : సీఎం జగన్ మీద నిందలు వేస్తే మాత్రం.. వాడు వంద అడుగుల లోతులో పాతుకపోతాడంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి కామెంట్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టికెట్ల విషయంలో వస్తున్న విమర్శలపై ఆయన రెస్పాండ్ అయ్యారు. భీమ్లా నాయ‌క్ సినిమాకు టికెట్ల గురించి తనకు తెలియదని, తాను సినిమా వాడినే గానీ దాని గురించి తనకు తెలియదన్నారు. భీమ్లా నాయ‌క్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ఇబ్బంది పెట్టార‌ని ఆరోపించడం సరి కాదని, ఒకవేళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు సాక్ష్యం ఉంటే చూపెట్టడం, చెప్పడం చేయాలని సూచించారు. 2022, ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు పోసాని కృష్ణమురళి రావడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్ తో సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో.. ఆయన టికెట్ల విషయంలో చర్చిస్తారని ప్రచారం జరిగింది. దీనికి ఆయన తెరదించారు. సమావేశం అనంతరం పోసాని మీడియాతో మాట్లాడారు.

Read More : Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ చూడాలని ఎదురు చూస్తున్నాను.. వైరల్ అవుతున్న నారా లోకేష్ ట్వీట్..

తమ కుటుంబం క‌రోనాతో భాద‌ప‌డుతున్న స‌మ‌యంలో సీఎం, ఆయ‌న స‌తీమ‌ణి మాట సాయం చేశారని తెలిపారు. ఏఐజి ఆసుప‌త్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ను క‌లిసి కృత‌జ్ఞతలు తెలపడానికి తాను ఇక్కడకు రావడం జరిగిందని వివరణ ఇచ్చారు. సినిమా టికెట్ల‌ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న‌ సినిమాల నుండి ప్ర‌తిపాద‌న‌లు అందా‌కే టికెట్ల‌ ధ‌ర‌ల‌పై నిర్ణ‌యం వ‌స్తుందనే అభిప్రాయం వ్యక్తం చశారు. సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో సినిమా టికెట్ల ధ‌ర‌లపై చ‌ర్చించ‌లేదన్నారు. ఆలీకి ఇచ్చిన‌ట్టే త‌న‌కు ప‌ద‌వి ఇస్తున్నారనడంలో వాస్త‌వం లేదని కొట్టిపారేశారు.

Read More : BheemlaNayak: వ్యక్తి కోసం వ్యవస్థను వదలట్లేదు.. భీమ్లా నాయక్‌పై చంద్రబాబు రియాక్షన్!

ఇక భీమ్లా నాయక్ మూవీ విషయానికి వస్తే… ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తెలంగాణలో సినీ పరిశ్రమని సపోర్ట్ చేస్తూ అయిదవ షో పర్మిషన్లు ఇచ్చారు. బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి మారలేదు. ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ఉండటంతో థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. . సినిమాల పట్ల, పవన్ పట్ల ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు. ఈ విషయంలో టీడీపీ కూడా స్పందించింది.

ట్రెండింగ్ వార్తలు