Visakha Swetha Case : విశాఖ శ్వేత కేసులో మరో సంచలనం

Visakha Swetha Case : ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతో పాటు శ్వేత సెల్ ఫోన్ కీలకంగా మారింది. మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Visakha Swetha Case : విశాఖలో కలకలం రేపిన వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేత భర్త మణికంఠ చెల్లెలి భర్త సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు సత్యంపై కేసు నమోదు చేశారు త్రీ టౌన్ పోలీసులు.

మరోవైపు శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతో పాటు శ్వేత సెల్ ఫోన్ కీలకంగా మారింది. మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో విశాఖలోని జ్ఞానపురం స్మశాన వాటికలో శ్వేత అంత్యక్రియలు జరగనున్నాయి. (Visakha Swetha Case)

ఈ కేసులో డెత్ మిస్టరీ వీడాల్సి ఉంది. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ నెల 25న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్వేత.. 26న ఉదయం వైఎంసీఏ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. బీచ్ లో మృతదేహం కనిపించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శ్వేత అత్తమామలు, భర్తతో పాటు మణికంఠ చెల్లెలి భర్త సత్యం కూడా శ్వేతను వేధించినట్లు శ్వేత తల్లి ఆరోపించారు. పెళ్లైన నాటి నుంచి శ్వేతకు టార్చర్ మొదలైందన్నారు. అత్తమామలు, భర్త వేధింపులకు తోడు మణికంఠ చెల్లెలి భర్త సత్యం కూడా శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దాంతో శ్వేత చాలా కుంగిపోయిందని, దీని గురించి శ్వేత తన భర్తతో చెప్పినా అతడు పట్టించుకోలేదని శ్వేత తల్లి వాపోయారు.

తప్పు చేసింది చెల్లెలి భర్త అయినా.. తన కూతురితోనే క్షమాపణలు చెప్పించారని శ్వేత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన 6 నెలలకు టార్చర్ మరింత ఎక్కువైందన్నారు. అంతేకాకుండా శ్వేత పేరుమీదున్న స్థలాన్ని తమ పేరు మీదకు రాయాలని ఒత్తిడి తెచ్చారని, భర్తతో కలిసి ప్రశాంతంగా ఉండేందుకు వీలు లేకుండా చేశారని, భర్తను తన కూతురి నుంచి విడదీశారని శ్వేత తల్లి రమాదేవి కన్నీంటిపర్యంతం అయ్యారు.

Also Read..Visakha Swetha Case : విశాఖ బీచ్‌లో మృతదేహం కలకలం.. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అసలేం జరిగింది?

సముద్రంలో దూకి చనిపోతే సుమారు 24గంటల వరకు డెడ్ బాడీ దొరికే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఇక, శ్వేత శరీరంపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ.. మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉంది. దాంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. కేజీహెచ్ లో శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది. ఆ రిపోర్టు ఆధారంగా శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అనేది పోలీసులు తేల్చేయనున్నారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు రావడానికి నెల రోజులు సమయం పట్టనుంది.

శ్వేత తల్లి రమ.. అత్తింటి వారిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్వేత తల్లి ఫిర్యాదు మేరకు ఇప్పటికే అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిని అత్తింటి వారే పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు రమ. శ్వేత భర్త మణికంఠ రెండుసార్లు ఆమె గొంతు నొక్కాడని, గొంతు నొక్కి చంపేస్తానని శ్వేత మామ బెదిరించినట్లుగా తన కూతురు శ్వేత చెప్పిందని రమ తెలిపారు. శ్వేత మృతిపై సమగ్ర దర్యాఫ్తు జరపాలని శ్వేత తల్లి కోరుకున్నారు.(Visakha Swetha Case)

చిన్న విషయాన్ని శ్వేత పెద్దదిగా చేస్తుందని ఆమె భర్త మణికంఠ అన్నారు. ఇంట్లో గొడవలు కామన్ అని సర్ది చెప్పినా శ్వేత వినేది కాదన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం శ్వేతకు లేదన్నారు భర్త మణికంఠ. గొడవలు అందరి ఇళ్లల్లోనూ కామన్ అని మణికంఠ చెప్పాడు. ఇంట్లో సహజంగా జరిగే చిన్న చిన్న గొడవలకే శ్వేత ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని తాను ఊహించలేదన్నాడు భర్త మణికంఠ. శ్వేతను మేము ఎప్పుడూ టార్చర్ పెట్టలేదన్నాడు. మాటల రూపంలో చిన్నగా చెబుతూ వచ్చాం. కానీ, శ్వేత మా మాటలను హార్ష్ గా తీసుకుంది.

Also Read..Visakha Swetha Case : విశాఖ శ్వేత మృతి కేసులో కీలక విషయాలు.. ఆ లెటర్‌లో ఏముందంటే

గతేడాది ఏప్రిల్ లో శ్వేత-మణికంఠల పెళ్లి జరిగింది. పెళ్లైన రెండు నెలలకే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. మణికంఠ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నాడు. శ్వేత అత్త మామల దగ్గర ఉంటోంది. శ్వేత ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. శ్వేత పోస్టుమార్టం రిపోర్టు, ఫోన్ కాల్ రికార్డింగ్స్ బయటకు వస్తే డెత్ మిస్టరీ వీడిపోనుంది.(Visakha Swetha Case)

ట్రెండింగ్ వార్తలు