Mekapati Goutham Reddy Live update: ఏపీ మంత్రి మేకపాటి కన్నుమూత.. లైవ్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ చేరుకున్న మంత్రి గౌతమ్.. తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ ఎక్స్ పో నుంచి నిన్ననే హైదరాబాద్ చేరుకున్న మంత్రి.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే లోపే పరిస్థితి చేజారి.. గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.

ముఖ్యమంత్రి జగన్ సహా.. మంత్రులు, పార్టీలకు అతీతంగా నేతలు.. గౌతమ్ రెడ్డి మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎల్లుండి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మేకపాటి తనయుడు విదేశాల్లో ఉన్న కారణంగా.. రేపు సాయంత్రం వరకూ స్వగ్రామం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు