Minister Narayana: ఆలోగా అన్న కాంటీన్ల ప్రారంభం: మంత్రి నారాయణ

టీడీపీ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నట్లు వివరించారు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. 3 వారాల్లో క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు అందించాలన్నారు. రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.

వీటిల్లో చాలా భవనాల నిర్మాణం జరిగిందని నారాయణ చెప్పారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని తెలిపారు. వైసీపీ సర్కారు అన్న క్యాంటీన్లని వేరే అవసరాలకు వినియోగించుకుందని అన్నారు. కండిషన్లో లేని నాటి అన్న క్యాంటీన్ల భవనాలను పునరుద్ధరించాలని ఆదేశించినట్లు చెప్పారు. రూ.73కు మూడు పూటల భోజనం పెడతామని ఇస్కాన్ చెప్పిందని తెలిపారు.

కానీ, తాము పేదలను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై రూ.5 భోజనం పెట్టామని అన్నారు. రూ.58 చొప్పున ఇస్కానుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. అప్పట్లో రోజుకు 2.25 లక్షల మంది భోజనం చేసేవారని చెప్పారు. టీడీపీ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నట్లు వివరించారు.

KTR: కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

ట్రెండింగ్ వార్తలు