KTR: కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్ర సర్కారు పట్టించుకోవడం లేదని అన్నారు.

KTR: కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

Ktr

నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరు సరిగ్గాలేదని చెప్పారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్ర సర్కారు పట్టించుకోవడం లేదని అన్నారు. ఓవైపు, గ్రేస్ మార్కుల గందరగోళం కొనసాగుతుంటే, మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో విద్యార్థుల తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నీట్ వ్యవహారంపై స్పందించాలని అన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులను శిక్షించాలని అన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేటీఆర్ అన్నారు.

మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ.. అమరావతి నిర్మాణంపై కీలక వ్యాక్యలు..