AP Police Officers : పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర.. తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలి

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో తాము పనిచేశామని గుర్తు చేశారు.

AP Police Allegations Chandrababu

AP Police Officers Allegations Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫైర్ అయింది. పుంగనూరు ఘటనను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ‘మీ రాజకీయాల కోసం మాపై దాడులు చేయడమేంటి’ అని ఏపీ పోలీసు అధికారుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఏపీ పోలీసు అధికారుల సంఘం సభ్యులు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

పోలీసులను హతమార్చేందుకు కాకుంటే తుపాకులు, రాడ్లు, కర్రలతో టీడీపీ నాయకులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనతో ఒక పథకం ప్రకారమే పోలీసులను హతమార్చే భారీ కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయని, దీనిపై ఎంక్వైరీ జరిపించాలన్నారు. పోలీసులపై దాడి జరుగినా ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ప్రజలు ఎవ్వరూ సానుభూతి చూపలేది, తాము సమాజంలో భాగం కాదా? అని అన్నారు. పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.

Punganur Incident : మారణాయుధాలతో ఉద్దేశపూర్వకంగానే దాడి.. ఎవరిని వదిలిపెట్టం : డీఐజీ, ఎస్పీ

పోలీసులపై కొంతమంది ఉద్ధేశపూర్వకంగానే దాడి చేశారని వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసుల పైనే దాడులు చేశారని పేర్కొన్నారు. 50 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో తాము పనిచేశామని గుర్తు చేశారు. తాము ఏ పార్టీకి అనుకూలంగా ఎన్నడూ పనిచేయలేదన్నారు. ఒకవేళ తాము సహనం కోల్పోతే పరిస్థితి ఏంటన్నారు. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని సూచించారు.

AP Volunteers: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి ఎం.సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు ఘటన దురదృష్టకరం అన్నారు. ఉద్ధేశపూర్వకంగానే కర్రలు, రాళ్లు వంటి మారణాయుధాలతో దాడి చేశారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించాలని చూశారని తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ ఎవరిపై ఎవరు దాడి చేశారని ప్రశ్నించారు. పోలీసులపై జరిగింది కాబట్టి సరిపోయింది.. ప్రజలపై జరిగితే తమనే విమరిస్తారని పేర్కొన్నారు. కష్ట కాలంలో తాము ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఉద్యోగాలు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ డ్యూటీ తాము చేస్తున్నామని వెల్లడించారు.

Paritala Sunitha : చంద్రబాబు ఒక్క మాట చెబితే.. వైఎస్ఆర్ గూండాలు రోడ్లపై తిరగలేరు : పరిటాల సునీత

40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారని నిలదీశారు. ‘మేము ఒక్క గంట పక్కకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? మీరు గుండెలపై చేయి వేసుకుని పడుకుంటున్నారంటే అది మా వల్లే.. పండుగలు వస్తే మీరు కుటుంబాలతో ఎంజాయ్ చేస్తారు.. మేము బందోబస్తు డ్యూటీ లో ఉంటాం’ అని తెలిపారు.

శుక్రవారం జరిగిన ఘటనతో తమ కుటుంబాల్లో భయం పట్టుకుందన్నారు. డీజీపీ గారికి తమ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం… తాము ఉద్యోగాలు చేయాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వంతో తమకు సంబంధం లేదు.. తాము డ్యూటీ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. ‘చంద్రబాబు నాయుడికి చేతులెత్తి మొక్కుతున్నాం…మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు’ అని వేడుకున్నారు.

Minister Peddireddy : చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారు : మంత్రి పెద్దిరెడ్డి

తాము ప్రభుత్వ ఉద్యోగులమని జాయింట్ సెక్రటరీ శేఖర్ రెడ్డి తెలిపారు. రాజకీయపార్టీలతో తమకు సంబంధం లేదన్నారు. రాళ్లు విసరడం, విధ్వంసానికి పాల్పడటం సంఘ విద్రోహ శక్తుల లక్షణాలు అని పేర్కొన్నారు. పోలీసులపై దాడులు చేసి ఏం చేయాలని చూస్తున్నారని, ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారని నిలదీశారు. తక్షణమే చంద్రబాబు పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు