Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

Bhadrachalam Temple: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే సీతారాముల దర్శనానికి భక్తులు బారులు తీరారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి చేరుకున్నారు. 135 జంటలు స్వామివారి నిత్య కళ్యాణంలో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం వందలాది మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Also Read: Pawan kalyan : గుంటూరు జిల్లాలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌..ఫ్లెక్లీలు, బ్యానర్లు తొలగింపు వివాదం

ఒక్కసారిగా తరలివచ్చిన భక్తులతో రామయ్య సన్నిధి కిటకిటలాడుతుంది. భక్తుల సౌకర్యార్ధం ఆలయం వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. త్రాగు నీరు, విశ్రాంత మందిరాలను ఏర్పాటు చేశారు. రానున్న శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అయితే ఈ ఏడాది స్వల్ప ఆంక్షల నడుమ భక్తులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నేడు పునర్వసు నక్షత్రం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు

Also read ;Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..‘‘యాత్రి నివాస్‌’’ నిర్మాణం

ట్రెండింగ్ వార్తలు