మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో కిలో చికెన్ ధర ఎంతో తెలుసా?

ఏపీలో చికెన్ ధరలు మాంసం ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కిలో చికెన్ ..

Chicken Price Hike : ఆదివారం వచ్చిందంటే మాంసాహారులకు ముందుగా గుర్తుకొచ్చేది కోడి మాంసం. ఉదయాన్నే చికెన్ దుకాణాల వద్ద పెద్దపెద్ద క్యూలైన్లు దర్శనమిస్తుంటాయి. కాస్త ఇబ్బంది అయినా ఓపిగ్గా లైన్లో నిలబడిమరీ చికెన్ తెచ్చుకుంటారు. అయితే, ఈ ఆదివారం ఉదయాన్నే దుకాణాల వద్దకు వెళ్లిన మాంసం ప్రియులకు కోడి ధరలు షాకిచ్చాయి. ముఖ్యంగా ఏపీలో చికెన్ ధర కొండెక్కింది. ఎండల తీవ్రత, కోళ్ల దాణా, రవాణా ఖర్చులు పెరగడంతోపాటు, కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు పెరిగాయని తెలుస్తోంది.

Also Read : మిర్చి సెంచరీ, బీన్స్ డబుల్ సెంచరీ..! మండిపోతున్న కూరగాయల ధరలు, వణికిపోతున్న ప్రజలు

ఏపీలో చికెన్ ధరలు మాంసం ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కిలో చికెన్ రూ. 250 నుంచి 300 విక్రయిస్తున్నారు. రిటైల్ షాపులో కిలో చికెన్ ధర రూ. 320 నుంచి 330 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు చికెన్ కొనుగోలు చేయాలంటే వెనుకాడుతున్నారు.

Also Read : బాబోయ్ జాగ్రత్త..! నాలుగు నెలల్లో దేశంలో ఎన్ని సైబర్ మోసాలు జరిగాయో తెలుసా?

చికెన్ లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న చికెన్ ధరలను బట్టిచూస్త పిల్లలకు ప్రొటీన్లుకూడా పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలుసైతం భారీగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి చికెన్, కూరగాయల ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని పేద వర్గాల ప్రజలు కోరుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు