Ambati Rambabu: జైలు నుంచి అంబటి రాంబాబు రిలీజ్.. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా తగ్గేదేలేదని కామెంట్
తనను జైల్లో పెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎప్పటి నుంచో ప్రయత్నించారని, అందులో భాగంగానే ఇప్పుడు అరెస్ట్ చేశారని అంబటి ఆరోపించారు.
Ambati Rambabu
Ambati Rambabu: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు రిలీజ్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి బెయిల్ మంజూరైంది. మూడు కేసుల్లోనూ ఆయన బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.
నన్ను చంపడానికి ప్రయత్నించారు..!
జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడారు అంబటి రాంబాబు. తనను జైల్లో పెడితే భయపడతా అనుకున్నారని, కానీ తాను భయపడను అని అంబటి అన్నారు. తనను జైల్లో పెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎప్పటి నుంచో ప్రయత్నించారని, అందులో భాగంగానే ఇప్పుడు అరెస్ట్ చేశారని అంబటి ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేశారని, తన భార్య పిల్లలను వేధించారని అంబటి వాపోయారు. తనను చంపడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కి వెళ్తే ప్రసక్తే లేదన్నారు. తాను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. ఎన్ని రోజులైనా జైల్లో ఉందామనే వెళ్లానని చెప్పారు.
2023లో సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. ఈ కేసులో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికే రెండు కేసుల్లో అంబటికి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి.. మూడో కేసులోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
అంబటి రాంబాబుపై నమోదైన మూడు కేసులు ఇవే..
ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారనే కేసులో తొలుత అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత పోలీసు విధులకు ఆటంకం కలిగించారని రెండో కేసు నమోదైంది. ఈ కేసులోనూ ఆయన బెయిల్ దొరికింది. ఇక, 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ అంబటిపై సత్తెనపల్లి పీఎస్లో కేసు నమోదవగా.. తాజాగా ఈ కేసులోనూ ఆయన బెయిల్ లభించింది. దీంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
Also Read: 1400 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో భర్తీ.. మంత్రి కీలక ప్రకటన
