4వ తేదీ వరకు మీరు ఇలాగే కలలు కనండి: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

YCP MLA Prakash Reddy: నాలుగు సీట్లకే టీడీపీ పరిమితం కాబోతోందని అన్నారు. చంద్రబాబు ఆదేశాలకు..

గెలుపుపై ఎన్నికల ఫలితాలు వచ్చే 4వ తేదీ వరకు టీడీపీ వాళ్లు కలలు కనండంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో 14కి 14 స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బాలకృష్ణ కూడా ఓడిపోతారని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. నాలుగు సీట్లకే టీడీపీ పరిమితం కాబోతోందని అన్నారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టీడీపీ చిన్న నాయకులు అంతా కలిసి టీడీపీకి హైప్ తీసుకొస్తున్నారని తెలిపారు. టీడీపీ అభ్యర్థులందరూ వైసీపీ నేతలను తిడుతూ ప్రచారాలు చేశారని అన్నారు.

టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై వారికే నమ్మకం లేదని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభంజనం కొనసాగుతుందని అన్నారు. 164 సీట్లతో తాము అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు. తమకు నచ్చిన అధికారులను నియమించికుని కూటమి నేతలు గొడవలు జరిపించారని ఆరోపించారు. ఈ సారి ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ దారుణంగా ఉందని అన్నారు.

Also Read: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరుకాలేకపోతున్న సోనియా గాంధీ

ట్రెండింగ్ వార్తలు