నగరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై కేసు నమోదు

నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరిట ఈ కేసును నమోదు చేశారు.

AP Plitics : తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరిట ఈ కేసును నమోదు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా భాను ప్రకాశ్, వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా, పలుపార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు రాకుండానే ఈసీ నిబంధనలకు విరుద్దంగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అంటూ ప్లెక్సీలు వెలిశాయి.

Also Read : Allu Arjun Tour Effect : అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఎఫెక్ట్.. ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లపై వేటు

టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ చేతుల మీదుగా పుత్తూరులో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలపై నగరి రిటర్నింగ్ అధికారికి వైసీపీ అభ్యర్ధి రోజా వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఈ అంశాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావించి గాలి భాను ప్రకాశ్ పై కేసు నమోదు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు