Allu Arjun Tour Effect : అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఎఫెక్ట్.. ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లపై వేటు

సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

Allu Arjun Tour Effect : అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఎఫెక్ట్.. ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లపై వేటు

Allu Arjun Tour Effect On Nandyala Police

Allu Arjun Tour : సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ అయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు టూటౌన్ ఎస్బి హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఎస్బి కానిస్టేబుల్ నాగరాజుల పై చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని వీఆర్ కు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : అర్థరాత్రి 1గంట వరకు విచారణ..! తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం..

పైస్థాయి అధికారులపై చర్యలు లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వేటు వేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, నంద్యాల డిఎస్పీ రావేంద్రనాద్ రెడ్డి, సిఐ రాజారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 60 రోజుల్లో శాఖ పరమైన విచారణకూడా చేయాలని సూచించినట్లు సమాచారం.