రిగ్గింగ్ జరుగుతోంది కాబట్టే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు: ఎంపీ గోరంట్ల మాధవ్

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.

Gorantla Madhav : ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 162 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలకు పైగా వైసీపీ గెలవబోతుంది. రెండోసారి లక్షలాది మంది సమక్షంలో వైజాగ్ లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మాధవ్ దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి అనేక మంది పందేలు కాస్తున్నారు. చంద్రబాబు తన సొంత సామాజికవర్గంలో అనేక మందిని తొక్కిపెట్టాడని మాధవ్ విమర్శించారు.

Also Read : నటి హేమకు మరో బిగ్‌షాక్‌.. 27న విచారణకు రావాలంటూ నోటీసులు

నారా లోకేశ్ పై గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో విమర్శలుచేశారు. టీడీపీ ఓడిపోతుంది కాబట్టే దౌర్జన్యం చేస్తున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులను భయపెట్టేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. అక్కడ కచ్చితంగా రిగ్గింగ్ జరిగింది.. కచ్చితంగా రీ పోలింగ్ జరపాలని మాధవ్ డిమాండ్ చేశారు. సీట్లు లేని చంద్రబాబు, ఓట్లు లేని బీజేపీ, జనసేన జతకట్టింది. ఎన్నికల్లో సపోర్ట్ గా ఉంటారని కూటమి కట్టుకున్నారు. ముగ్గురు కలిసి ఏదో జరగబోతుందని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు. కౌంటింగ్ రోజు వైసీపీ శ్రేణులు గందరగోళానికి గురికావొద్దని గోరంట్ల మాధవ్ సూచించారు.

Also Read : నగరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై కేసు నమోదు

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి కామెంట్స్ ..
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 14 స్థానాల‌కు 14 గెలుస్తున్నాం. నంద‌మూరి బాలకృష్ణ కూడా ఓడిపోతున్నాడు. నాలుగు సీట్లకే టీడీపీ పరిమితం కాబోతోంది. చంద్రబాబు ఆదేశానుసారం టీడీపీ చోటా నాయకులంతా కలసి ఆ పార్టీకి హైప్ తీసుకొస్తున్నారు. టీడీపీ అభ్యర్థులందరూ మమ్మల్ని తిడుతూ ప్రచారాలు చేశారు. నిజంగా టీడీపీ వారి మానిఫెస్టో పై వారికే నమ్మకం లేదు. రాష్ట్రంలో మరోసారి జగనన్న ప్రభంజనం ఖాయం. 164 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ దారుణంగా ఉంది. ప్రలోభాలు తప్ప నిజంగా గెలుస్తామని నమ్మకం కూటమి అభ్యర్థులకు లేదు. నాల్గో తేదీ వరకు టీడీపీ వాళ్ళు కలలు కనండి అంటూ ప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు