Chandrababu Remand: ఈ నెల 22 వరకు చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్.. బెయిల్ పిటిషన్ దాఖలు

కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుని కస్టడీకి కోరుతూ సీఐడీ న్యాయవాదులు పిటిషన్ వేశారు.

Chandrababu Naidu

Chandrababu Remand – ACB: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ (ACB) కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ (Judicial) రిమాండ్ విధించింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు తీర్పు చదివి వినిపించారు.

చంద్రబాబు నాయుడు సోమవారం హైకోర్టుకు వెళ్లనున్నారు. ఆయన తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. కోర్టుతో పాటు విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు పరిసరాలన్నీ పూర్తిగా పోలీసుల పహారాలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లడానికి కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు.

చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు వద్దే గడిపారు. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేశారు. చివరకు తీర్పు వెల్లడైంది. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.

బెయిల్ పిటిషన్

చంద్రబాబు నాయుడికి బెయిల్ కోసం ఆయన తరఫున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో అడ్మిట్ అయింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

కస్టడీకి ఇవ్వండి

చంద్రబాబు నాయుడుని కస్టడీకి కోరుతూ సీఐడీ న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఏసీబీ కోర్టులో అడ్మిట్ అయింది. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Kesineni Nani : చంద్రబాబు అరెస్ట్ కేసు.. ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు