Chandrababu Target Kodali Nani : టార్గెట్ కొడాలి నాని.. గుడివాడపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. స్కెచ్ ఇదే

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మాజీమంత్రి కొడాలి నానికి చెక్ పెట్టాలని టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

Chandrababu Target Kodali Nani : కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మాజీమంత్రి కొడాలి నానికి చెక్ పెట్టాలని టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కొడాలి నాని టార్గెట్ గా గుడివాడలో భారీ బహిరంగ సభకు కసరత్తు చేస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన పుట్టిన ప్రాంతం గుడివాడలో సభను నిర్వహించి వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మాజీమంత్రి కొడాలి నాని పేరు చెబితేనే టీడీపీ కేడర్ ఆగ్రహంతో ఊగిపోయే పరిస్థితి. అంతలా ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నారు కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నేత లోకేశ్ టార్గెట్ గా తీవ్ర పదజాలంతో నాని విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఆయనకు చెక్ పెట్టాలని టీడీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, అవన్నీ విఫలం అయ్యాయి.

Perni Nani : మోదీని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు : మాజీ మంత్రి పేర్ని నాని

ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొడాలి నాని మంత్రి పదవి పోయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్నటికి మొన్న పదో తరగతి విద్యార్థులతో లోకేశ్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే అందులోనూ ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. దీంతో గుడివాడను ఇలానే వదిలేస్తే చాలా కష్టమని భావించిన టీడీపీ అధిష్టానం కొడాలికి చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. దానికి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను వేదికగా చేసుకుంది.(Chandrababu Target Kodali Nani)

ఈ నెల 29న జిల్లా మహానాడులో భాగంగా గుడివాడలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారు. భారీ జనసమీకరణ చేసి గుడివాడలో తమ పట్టు నిరూపించుకోవాలని, తద్వారా కొడాలి నానిపై పైచేయి సాధించాలనేది టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ ఏదైనా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆధిపత్యానికి గండి కొట్టాలని టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం గుడివాడలో టీడీపీని పట్టించుకునే నాయకుడు లేకుండా పోయాడు. ఉన్న కొద్దిమంది నాయకుల్లో మూడు గ్రూపులుగా తయారయ్యారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ మరికొంతమంది నేతలు మాత్రమే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం రావి వెంకటేశ్వరావు గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.

కేసినో వ్యవహారంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించినప్పుడు కూడా స్థానిక నేతలెవరూ వీరికి సహకరించలేదు. కొడాలి నానికి స్థానిక నేతలు ఎంత భయపడుతున్నారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో గుడివాడలో బహిరంగ సభను సక్సెస్ చేయడానికి ఏకంగా టీడీపీ అధిష్టానమే డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. మాజీమంత్రి కొల్లు రవీంద్ర స్థానిక నాయకులతో కలిసి బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చర్చించారు. అనుకూలమైన స్థలాలను కూడా పరిశీలించారు.

గుడివాడలో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఒకటి రెండు రోజుల్లో టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడు ఇప్పటికే స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. జనసమీకరణను చాలెంజ్ గా తీసుకోవాలని కృష్ణా జిల్లా నేతలందరికీ పిలుపునిచ్చారు. ఈ నెల 29న సాయంత్రం గుడివాడలో మహానాడు, బహిరంగసభ, రాత్రి నిమ్మకూరులో చంద్రబాబు బస, 30న ఉదయం బందరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రివ్యూలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. గుడివాడలో బహిరంగసభకు ప్రభుత్వం, అధికార పార్టీ ఆటంకాలు కలిగిస్తుందనే అనుమానంతో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా టీడీపీ హైకమాండ్ రెడీ చేసుకుంది.

ఏపీ వ్యాప్తంగా బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు చేస్తున్న పర్యటనలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో గుడివాడలోనూ తమ సత్తా చూపించాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటి కాలిపై లేచే కొడాలి నాని నోరూ మూయించాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు సక్సెస్ తో ఊపుమీదున్న టీడీపీ.. ఆ స్థాయిలోనే గుడివాడ మహానాడును కూడా జయప్రదం చేస్తామంటోంది.

ట్రెండింగ్ వార్తలు