Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇంటి కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ అధికారులకు సూచించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న  విచారణకు వాయిదా వేసింది.

Ayyanna Patrudu: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసేందుకు ఆదివారం తెల్లవారు జామున అధికారులు ప్రయత్నించారు. రెండు పొక్లెయిన్లతో పాటు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇంటివెనుక ప్రహరీ గోడను కూల్చివేయడం ప్రారంభించారు. టీడీపీ కేడర్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన తెలపడంతో కూల్చివేతను అధికారులు నిలిపివేశారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు రాజేష్ రెండు సెంట్లను ఆక్రమించి నిర్మాణం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Minister Taneti Vanitha: అయ్యన్నపాత్రుడుకు మంత్రి తానేటి వనిత సలహా

తమ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిలిపివేయాలంటూ హైకోర్టులో హౌస్ మోహసన్ పిటీషన్ దాఖలు చేశారు ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారమే అయ్యన్నపాత్రుడు ఇంటి నిర్మాణం చేయడం జరిగిందని, తహసీల్దార్, జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని పిటీషనర్ల తరపు లాయర్ తన వాదనను వినిపించారు. రాజకీయ కక్షతో, నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి కూల్చివేతలు నిర్వహించేందుకు అధికారులు పూనుకున్నారని కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటికే కొంతభాగం కూల్చివేత జరిగిందని రెవెన్యూశాఖ తరపున ప్రభుత్వ లాయర్ చెప్పారు. అలాగే పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

వాదనలను పరిగణలోకి తీసుకున్న జడ్జి.. అర్థరాత్రి కూల్చివేతలేంటని అధికారులను ప్రశ్నించారు. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలు ఉండగా ఇదేం పద్దతి అని అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న  విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు