దూసుకొస్తున్న రెమాల్.. ఈశాన్య రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం.. ఏపీలో మాత్రం..

రెమాల్ తుఫాన్ ప్రభావం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Remal : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫాన్ కు రెమాల్ గా నామకరణం చేశారు. ఖేపుపురా (బంగ్లాదేశ్)కి దక్షిణంగా 610కిలో మీటర్ల దూరంలో.. సాగర్ దీవులకు (పశ్చిమ బెంగాల్)కు దక్షిణంగా 640 కిలో మీటర్ల దూరంలో అదేవిధంగా కానింగ్ (పశ్చిమ బెంగాల్)కు దక్షిణంగా 640 కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈనెల 26 (ఆదివారం) ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఉత్తరం వైపు కదులుతూ మే 26 అర్ధరాత్రికి సాగర్ ద్వీపం- ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తుఫాను తీరందాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..

రెమాల్ తుఫాన్ ప్రభావం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకూడా కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : చంద్రబాబు నాయుడికి చురకలు అంటించిన విజయసాయిరెడ్డి

రెమాల్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండొదని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగాయని చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు