Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన అంజలి.. చరణ్‌తో ఫ్లాష్ బ్యాక్‌లో..

గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దిల్ రాజు.

Game Changer Update : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఒక్క సాంగ్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్నా లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్స్ రాలేదు. అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్న సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని నిరాశ చెందుతున్నారు.

గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి కూడా నటిస్తుందని తెలిసిందే. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలతో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరసన కనిపిస్తుందని అర్ధమవుతుంది. తాజాగా అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడింది.

Also Read : Vijay – Rashmika : విజయ్ దేవరకొండ పెట్ డాగ్‌తో రష్మిక స్పెషల్ ఫొటో.. వైరల్ అవుతున్న ఫొటో..

గేమ్ ఛేంజర్ సినిమా గురించి అంజలి మాట్లాడుతూ.. ఇంకా షూటింగ్ కొంచెం ఉంది. త్వరలోనే రిలీజ్ అవుతుంది. చరణ్ తో కలిసి నేను ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాను. మా ఇద్దరికీ ఒక సాంగ్ కూడా ఉంది. నేను ఇందులో హీరోయిన్ గానే నటిస్తున్నాను, కీ రోల్ కాదు అని తెలిపింది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇవ్వమని మీడియా ప్రతినిధులు అడగ్గా దిల్ రాజు గారు, శంకర్ గారు చెప్పకుండా మేము చెప్పకూడదు అని చెప్పింది. అలాగే రామ్ చరణ్ మంచి వ్యక్తి. నటనలో 100 శాతం ఇవ్వడానికి ట్రై చేస్తాడు అని చరణ్ గురించి చెప్పింది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని క్లారిటీ అయితే వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు