Team India : మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్‌.. కోహ్లి లేకుండానే అమెరికా విమానం ఎక్కిన‌ రోహిత్ సేన‌.. హార్దిక్ పాండ్యా సైతం..

భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌కప్ ఆరంభం కానుంది.

Team India : భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌కప్ ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నీ తొలి ద‌శ మ్యాచ్‌లు అమెరికాలో, మిగిలిన మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జ‌ర‌గ‌నున్నాయి. వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమ్ఇండియా పొట్టికప్‌పై కన్నేసింది. ఎట్టిపరిస్థితుల్లో కప్‌ను సాధించి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది.

భార‌త జ‌ట్టు రెండు బృందాలుగా అమెరికాకు వెళ్ల‌నుంది. అందులో భాగంగా మొద‌టి బృందం శ‌నివారం అమెరికాకు బ‌య‌లు దేరింది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోర్‌లో పాటు మ‌రికొంద‌రు ఆట‌గాళ్లు ముంబై విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరారు. ఈ బృందంలో రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో పాటు స‌హాయ‌క కోచింగ్ సిబ్బంది ఉన్నారు.

SRH : ఆస్ట్రేలియా కెప్టెన్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అయితే.. ఐపీఎల్ ట్రోఫీ స‌న్‌రైజ‌ర్స్‌దే..

విరాట్ కోహ్లి ఎక్క‌డ‌..?

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి లేకుండా రోహిత్ సేన అమెరికా విమానం ఎక్కింది. దీంతో కోహ్లి ఎందుకు వెళ్ల‌లేదు అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. వాస్త‌వానికి కోహ్లి మొద‌టి బృందంలోనే వెలుతాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అమెరికా వెళ్లేందుకు కావాల్సిన పేప‌ర్ వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డంతో కోహ్లి విమానం ఎక్క‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

పేప‌ర్ వ‌ర్క్ పూర్తి చేసుకుని అత‌డు మూడు, నాలుగు రోజుల్లో అమెరికా బ‌య‌లు దేర‌నున్నాడ‌ని అంటున్నారు. నివేదిక‌ల ప్ర‌కారం జూన్ 30న‌ కోహ్లి అమెరికా విమానం ఎక్క‌నున్నాడు. దీంతో అత‌డు జూన్ 1 న శ‌నివారం బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న ఏకైక వార్మ‌ప్ గేమ్‌లో ఆడ‌డ‌ని తెలుస్తోంది.

పాండ్య సైతం..

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ఎప్పుడో ముగిసి పోవ‌డంతో మొద‌టి విడుత బృందంలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉంటాడ‌ని అంతా భావించారు. శ‌నివారం విమానం ఎక్కిన ఆట‌గాళ్ల‌లో హార్దిక్ క‌నిపించ‌లేదు. అయితే.. ప్ర‌స్తుతం అత‌డు లండ‌న్‌లో ఉన్నాడ‌ని, నేరుగా యూఎస్‌లో జ‌ట్టుతో చేర‌తాడ‌ని నివేద‌క‌లు చెబుతున్నాయి. ఇక రెండో బృందం ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన మ‌రుస‌టి రోజు బ‌య‌లు దేర‌నుంది.

Virat Kohli : ఐపీఎల్ నుంచి ఆర్‌సీబీ ఔట్‌.. విరాట్ కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త ప్ర‌యాణం జూన్ 5న‌ ప్రారంభం కానుంది. టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను న‌సావులోని కౌంటీలో ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. పాకిస్తాన్‌తో జూన్ 9న‌, అమెరికాతో జూన్ 12న‌, కెన‌డాతో జూన్ 15న భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

2007లో ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ ఆరంభ ఎడిష‌న్‌ను టీమ్ఇండియా గెలుచుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి క‌ప్పును ముద్దాడ‌లేదు. 2022 ఎడిష‌న్‌లో సెమీఫైన‌ల్‌లో ఓట‌మి పాలైంది.

ట్రెండింగ్ వార్తలు