Babar Azam : బాబ‌ర్ ఆజాం నుంచి కోహ్లికి ముప్పు.. రోహిత్ శ‌ర్మను వెన‌క్కి నెట్టేశాడు..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో బాబ‌ర్ ఆజాం దూసుకుపోతున్నాడు.

Babar Azam – Virat Kohli : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో బాబ‌ర్ ఆజాం దూసుకుపోతున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. శ‌నివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబ‌ర్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 26 బంతుల‌ను ఎదుర్కొన్న బాబ‌ర్ 4 ఫోర్ల‌తో 32 ప‌రుగులు చేశాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక ప‌రుగులు చేసిన రికార్డు ప్ర‌స్తుతం టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 117 మ్యాచుల్లో 4037 ప‌రుగులు చేశాడు. బాబ‌ర్ ఆజాం 118 మ్యాచుల్లో 3987 ప‌రుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 151 మ్యాచుల్లో 3974 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

Team India : మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్‌.. కోహ్లి లేకుండానే అమెరికా విమానం ఎక్కిన‌ రోహిత్ సేన‌.. హార్దిక్ పాండ్యా సైతం..

టీ20 క్రికెట్‌లో 4వేల ప‌రుగుల చేసిన మొద‌టి పాకిస్తాన్ బ్యాట‌ర్‌గా నిలిచేందుకు బాబ‌ర్ ఆజాంకు మ‌రో 13 ప‌రుగులు అవ‌స‌రం. అదే స‌మ‌యంలో విరాట్ కోహ్లిని రికార్డును బ్రేక్ చేసేందుకు అత‌డికి మ‌రో 51 ప‌రుగులు అవ‌స‌రం. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మ‌రో రెండు మ్యాచులు ఆడ‌నున్న నేప‌థ్యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందుకు కోహ్లి రికార్డును బాబ‌ర్ బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది.

అంత‌ర్జాతీయ టీ20క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 109 ఇన్నింగ్స్‌ల్లో 4037 పరుగులు
బాబర్ ఆజం (పాకిస్తాన్‌) – 111 ఇన్నింగ్స్‌ల్లో 3987 ప‌రుగులు
రోహిత్ శర్మ(భార‌త్‌) – 143 ఇన్నింగ్స్‌ల్లో 3974 ప‌రుగులు
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్‌) – 118 ఇన్నింగ్స్‌ల్లో 3531 ప‌రుగులు
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్‌) – 136 ఇన్నింగ్స్‌ల్లో 3491 ప‌రుగులు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు చేసింది. కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (51 బంతుల్లో 84) హాఫ్ సెంచ‌రీ చేశాడు. విల్ జాక్స్(23 బంతుల్లో 37), బెయిర్ స్టో (18 బంతుల్లో 21) లు రాణించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రీది మూడు వికెట్లు తీయ‌గా, ఇమాద్ వసీం, హరీస్ రవూఫ్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

SRH : ఆస్ట్రేలియా కెప్టెన్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అయితే.. ఐపీఎల్ ట్రోఫీ స‌న్‌రైజ‌ర్స్‌దే..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ 19.2 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 23 ప‌రుగుల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో ఫ‌ఖార్ జ‌మాన్ (21 బంతుల్లో 45), కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (26 బంతుల్లో 32)లు ఫ‌ర్వాలేద‌నిపించారు.

ట్రెండింగ్ వార్తలు