Minister Taneti Vanitha: అయ్యన్నపాత్రుడుకు మంత్రి తానేటి వనిత సలహా

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.

Minister Taneti Vanitha: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. కబ్జా స్థలంలో కూల్చివేతలకు సంబంధించి 15 రోజులకు ముందే అయ్యన్నకు అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు అక్కడికి వచ్చారని మంత్రి వనిత వివరించారు.

Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం

అయ్యన్న పాత్రుడు సతీమణి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.. మహిళలను, దళితులను తన భర్త కించపర్చినట్లు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణమని అన్నారు. కబ్జాలో ఉన్న గోడను తొలగించడం రాజకీయ కుట్ర అనడం సరికాదని, రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకొస్తున్నాయని మంత్రి విమర్శించారు.

YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..

వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా పాలన సాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లాగ తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం లేదని, అయ్యన్నపాత్రుడు తన తప్పును ఒప్పుకుంటే మంచిదని మంత్రి హితవు పలికారు.

ట్రెండింగ్ వార్తలు