ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మాజీమంత్రి పుష్పలీల కామెంట్స్

Ex Minister Pushpaleela: ఎమ్మెల్సీ కవిత తనకు భయం అవుతుందని జైల్లో ఏడ్చారని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని పుష్పలీల అన్నారు.

హైదరాబాద్‌ను బేస్ చేసుకుని బీజేపీ కుట్రలు పన్నుతోందని, అల్లర్లు సృష్టించాలనుకుంటోందని మాజీమంత్రి పుష్పలీల అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ పుష్పలీల మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్ల స్కామ్‌లో అరెస్ట్ చేస్తారని మాజీ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత తనకు భయం అవుతుందని జైల్లో ఏడ్చారని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని పుష్పలీల అన్నారు. దమ్ముంటే ఈవీఎంలను తీసేసి ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీ చెప్పారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ ధైర్యం లేదని చెప్పారు. ఈవీఎంలు సరికాదని ఎలాన్ మస్క్ కూడా చెప్పారని అన్నారు.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నాయని పుష్పలీల చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.

Also Read: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ.. ఎంతమందితో అంటే ..

ట్రెండింగ్ వార్తలు