Sandeep Lamichhane : అత్యాచార ఆరోప‌ణ‌లు.. క‌ట్ చేస్తే.. టీ20 ఫార్మాట్‌లోనే అరుదైన ఘ‌న‌త‌..

నేపాల్ స్టార్ స్పిన్న‌ర్ సందీప్ లామిచానే అరుదైన ఘ‌నత సాధించాడు.

Sandeep Lamichhane 100 T20 wickets : నేపాల్ స్టార్ స్పిన్న‌ర్ సందీప్ లామిచానే అరుదైన ఘ‌నత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. సెయింట్ విన్సెంట్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఈ చారిత్రాత్మ‌క ఫీట్‌ను సాధించాడు. 54 మ్యాచుల్లో 12.58 స‌గ‌టు, 6.29 ఎకాన‌మీతో వంద వికెట్లు ప‌డ‌గొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఘ‌న‌త అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ పేరిట ఉంది. ర‌షీద్ 53 మ్యాచుల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు.

టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు..

రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్‌) – 53 మ్యాచ్‌లు
సందీప్ లామిచానే (నేపాల్) – 54 మ్యాచ్‌లు
వనిందు హసరంగా (శ్రీలంక) – 63 మ్యాచ్‌లు
హరీస్ రవూఫ్ (పాకిస్థాన్ ) – 71 మ్యాచ్‌లు

Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్‌..

అత్యాచార ఆరోప‌ణ‌లు..

సందీప్ లామిచానేపై అత్యాచార‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 18 ఏళ్ల యువ‌తిపై అత్యాచారం చేసిన కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు 2024లో జ‌న‌వ‌రిలో అత‌డిని దోషిగా తేల్చింది. ఈ క్ర‌మంలో అత‌డికి 8 సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌, మూడు ల‌క్ష‌ల నేపాలీ రూపాయ‌లను జ‌రిమానాగా విధించింది. దీంతో పాటు బాధితురాలికి రూ.2లక్ష‌ల నేపాలీ రూపాయలు చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు అత‌డిపై నిషేదం విధించింది.

అత్యాచారం కేసులో అత‌డు పై కోర్టుకు వెళ్ల‌గా.. ఇటీవ‌ల న్యాయ స్థానం అత‌డిని నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఆ వెంట‌నే నేపాల్ క్రికెట్ బోర్డు అత‌డిపై నిషేదాన్ని ఎత్తివేసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో స్థానం క‌ల్పించింది. వీసా సంబంధిత స‌మ‌స్య‌ల కార‌ణంగా అమెరికాకు వెళ్ల‌లేక‌పోయాడు. అయితే.. వెస్టిండీస్ వేదిక‌గా గ్రూపు ద‌శ‌లో ఆఖ‌రి రెండు మ్యాచుల్లో నేపాల్ త‌రుపున అత‌డు ఆడాడు.

Gautam Gambhir : బీసీసీఐకి గంభీర్ ష‌ర‌తు.. టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా వ‌చ్చేందుకు..!

ట్రెండింగ్ వార్తలు