Babar Azam : టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు.

Babar Azam breaks Dhoni record for most runs as captain in T20 World Cup history
Babar Azam – MS Dhoni : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజాం 34 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు..
బాబర్ ఆజాం (పాకిస్తాన్) – 17 ఇన్నింగ్స్‌ల్లో 549 పరుగులు
ఎంఎస్ ధోని (భారత్) – 29 ఇన్నింగ్స్‌ల్లో 529 పరుగులు
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 19 ఇన్నింగ్స్‌ల్లో 527 పరుగులు
మహేల జయవర్ధనే (శ్రీలంక) – 11 ఇన్నింగ్స్‌ల్లో 360 పరుగులు
గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) – 16 ఇన్నింగ్స్‌ల్లో 352 పరుగులు.
Gautam Gambhir : బీసీసీఐకి గంభీర్ షరతు.. టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చేందుకు..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్ జట్లు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ (19 బంతుల్లో 31) రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ అమీర్ రెండు పడగొట్టాడు.
అనంతరం పాకిస్తాన్ 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ బాబర్ ఆజాం (34 బంతుల్లో 32 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (21 బంతుల్లో 17), షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13నాటౌట్) లు రాణించారు. దీంతో పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Babar Azam : ఓదార్పు విజయం.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం కీలక వ్యాఖ్యలు.. ఇంటికెళ్లాక..
ఐర్లాండ్ పై గెలుపొందినప్పటికి పాకిస్తాన్ పొట్టి ప్రపంచకప్‌లో గ్రూపు దశ నుంచే నిష్ర్కమించింది. భారత్, అమెరికా చేతుల్లో ఓడడం పాకిస్తాన్ అవకాశాలను దెబ్బతీశాయి.