Stunning Catch : మీక‌ళ్ల‌ని మీరే న‌మ్మ‌లేరు.. క్రికెట్ చరిత్ర‌లోనే అత్యుత్త‌మ క్యాచ్‌..!

క్రికెట్ అంటే ఫోర్లు, సిక్స‌ర్లే కాదు ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాలు అల‌రిస్తుంటాయి.

Paul Coughlin -Stunning Catch : క్రికెట్ అంటే ఫోర్లు, సిక్స‌ర్లే కాదు ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాలు అల‌రిస్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌లో జ‌రుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో బౌల‌ర్ అందుకున్న క్యాచ్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

లీగ్‌లో భాగంగా ఆదివారం డ‌ర్హామ్‌, లంకాషైర్ ల జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. లంకాషైర్ ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను డ‌ర్హామ్ ఆల్ రౌండ‌ర్ పాల్ కొగ్లిన్ వేశాడు. నాలుగో బంతిని యార్కర్‌ వేయడానికి ప్ర‌య‌త్నించ‌గా అది లో ఫుల్‌టాస్ అయింది. లంకాషైర్ బ్యాట‌ర్ మాథ్యూ హ‌ర్ట్స్ ఆబాల్  స్ట్రైట్ షాట్ ఆడాడు.

Sandeep Lamichhane : అత్యాచార ఆరోప‌ణ‌లు.. క‌ట్ చేస్తే.. టీ20 ఫార్మాట్‌లోనే అరుదైన ఘ‌న‌త‌..

బ్యాట‌ర్ కొట్టిన బంతి త‌న త‌ల‌కు తాకుతుంద‌ని బావించిన కొగ్గిన్‌.. త‌ల‌ను ర‌క్షించుకునే క్ర‌మంలో కింద‌కి వంగ‌డంతో పాటు రెప్ప‌పాటులో చేతితో బాల్‌ను న‌మ్మ‌శ‌క్యం గానీ విధంగా అందుకున్నాడు. దీన్ని చూసిన బ్యాట‌ర్‌కు కాసేప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగిందో అర్థ‌గాక అలాగే క్రీజులో ఉండిపోయాడు.

న‌మ్మ‌శ‌క్యంగానీ విధంగా అత‌డు అందుకున్న క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన క్యాచుల్లో ఇదే అత్యుత్త‌మ క్యాచ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్‌..

ట్రెండింగ్ వార్తలు